Vijay Devarakonda | Balakrishna : లైగర్ సెట్‌లో లయన్... అందరినీ ఆశ్చర్యపరిచిన బాలయ్య..

Balakrishna in Liger sets Photo : Twitter

Vijay Devarakonda | Balakrishna : విజయ్ దేవరకొండ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీమ్‌కు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. అయితే బాలయ్య అక్కడ కనిపించడంతో మేకర్స్ తో పాటు విజయ్ దేవరకొండ సైతం ఆశ్చర్యపోయారు.

 • Share this:
  సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా ఇప్పుడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా తర్వాత ఈ చిత్రం షూట్ ఇటీవల గోవాలో మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా సెట్స్ లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ లైగర్‌ షూటింగ్ లోకేషన్‌లో ఎంట్రీ ఇచ్చి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. బాలయ్య సినిమా అఖండ సినిమా కూడా గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది.  దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  బ్రేక్ సమయంలో బాలయ్య లైగర్ లోకేషన్‌కు వచ్చి వెళ్లారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక గతంలో బాలయ్య హీరోగా పూరి దర్శకత్వంలో “పైసా వసూల్” అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత కూడా వీరి కాంబో నుంచి మరో సినిమా రానుంది అని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద టాక్ నడిచింది. ఇక విజయ్ దేవరకొండ లైగర్ విషయానికి వస్తే..

  లైగర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. లైగర్‌ను (Liger) ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే  (Ananya Panday )నటిస్తోంది. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

  Chiranjeevi : చిరంజీవి నట ప్రయాణానికి నలబై మూడు సంవత్సరాలు.. భావోద్వేగం చెందిన మెగాస్టార్..

  ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్‌ను పున : ప్రారంభించింది.


  ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. తెలుగు తమిళ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

  Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్ కేసులో ఈడీ ముందుకు తరుణ్.. మొదలైన విచారణ...

  లైగర్‌లో విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. లైగర్ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ముందుగా ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది.

  ఇక విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత విజయ్‌తో ఉందనుందని తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published: