చిరంజీవి నాయకత్వం ఇండస్ట్రీలో కొందరికి నచ్చట్లేదా..?

Chiranjeevi: ఏమో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇదే అనిపిస్తుంది. నిజంగానే కొందరు హీరోలకు చిరంజీవి నాయకత్వం నచ్చట్లేదనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2020, 3:52 PM IST
చిరంజీవి నాయకత్వం ఇండస్ట్రీలో కొందరికి నచ్చట్లేదా..?
చిరంజీవి (Megastar Chiranjeevi)
  • Share this:
ఏమో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇదే అనిపిస్తుంది. నిజంగానే కొందరు హీరోలకు చిరంజీవి నాయకత్వం నచ్చట్లేదనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది కూడా. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరైన బాలయ్యకు ప్రభుత్వంతో షూటింగ్స్ అనుమతి కోసం నిర్మాతలు జరుపుతున్న చర్చల గురించి తెలియకపోవడం నిజంగానే ఆశ్చర్యకరమైన విషయం.

టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు (Twitter/Photo)
టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు (Twitter/Photo)


అసలు ఈయనకు తెలియకపోవడం ఏంటి.. తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడా లేదంటే తెలుసుకునే ప్రయత్నమే చేయలేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. పైగా అక్కడ అన్నింటికీ వేదిక చిరంజీవి ఇల్లు కావడం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో చాలా విషయాలపై చిరు ముందుడుగు వేస్తున్నాడు. ఆయనే ముందుండి నడిపిస్తున్నా కూడా. మెగాస్టార్ నాయకత్వంలోనే ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో కూడా చిరు ప్రత్యేక చర్చలు జరపబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.

చిరంజీవి (Megastar Chiranjeevi/Twitter)
చిరంజీవి (Megastar Chiranjeevi/Twitter)


అయితే ఇక్కడే కొందరు హీరోలకు చిరంజీవి నాయకత్వం నచ్చడం లేదని.. తాము కూడా ఇండస్ట్రీలో పెద్ద హీరోలమే కదా మమ్మల్నెందుకు తక్కువ చేసి చూస్తున్నారంటూ సన్నిహితులతో వాపోతున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి ఇంట్లో మీటింగ్ జరిగినపుడు నాగార్జున మాత్రమే కనిపించాడు. ఆయనతో పాటు చిరంజీవి ఎలాగూ అక్కడే ఉన్నాడు.

నాగార్జున, చిరంజీవి (File/Photo)
నాగార్జున, చిరంజీవి (File/Photo)


వాళ్లిద్దరూ తప్ప హీరోలెవరూ అక్కడ కనిపించలేదు. నిర్మాతలు, దర్శకులు వచ్చారు. ఇప్పుడు బాలయ్య ఏకంగా తనకు మీటింగ్ జరిగిన విషయం కూడా పేపర్లలో చూసి తెలుసుకున్నట్లు చెప్పాడు. మోహన్ బాబు లాంటి వాళ్లు కూడా రాకపోవడం సంచలనంగా మారుతుంది. వీళ్లకు చిరు ముందుండటం నచ్చట్లేదా లేదంటే అన్నీ వాళ్లు చూసుకుంటారులే అనే ధైర్యంతోనే వదిలేసారా అనేది ఆసక్తికరంగా మారుతుందిప్పుడు. మరి ఈ విషయంపై ఎవరొచ్చి క్లారిటీ ఇస్తారో చూడాలిక.
First published: May 28, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading