తాజాగా బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అందులో ముఖ్యంగా తన మావయ్య బాలయ్యతో పాటు ఆయన తోటి హీరో చిరంజీవి మధ్య ఉన్న తేడాను వివరించాడు.
తాజాగా బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అందులో ముఖ్యంగా తన మావయ్య బాలయ్యతో పాటు ఆయన తోటి హీరో చిరంజీవి మధ్య ఉన్న తేడాను వివరించాడు.
టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణల మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. చిరంజీవి గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా ఎదిగారు. ఒక మావయ్య బాలకృష్ణ విషయానికొస్తే.. ఆయన ఎన్టీఆర్ గారి అబ్బాయిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అందుకే వారిద్దరినీ కంపేర్ చేయలేమని ఓ ప్రశ్నకు సమాచాధాన మిచ్చారు. ఇక మావయ్య బాలయ్య నటించిన సినిమాల విషయానికొస్తే.. అప్పట్లో ‘సరమసింహారెడ్డి’, తాజాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇంకోవైపు చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా అంటే తనకు ఇష్టమన్నారు. మిగతా హీరోల్లో నాగార్జన సినిమాల్లో ‘మన్మథుడు’, వెంటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలంటే ఎంతో ఇష్టమన్నారు. అంతేకాదు ఈ నలుగురిలో ఒకరికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఎవరికిస్తారు అంటే.. తాను అలా ఇవ్వలేనంటూ సమాధానమిచ్చాడు. అదే సమయంలో ఈ నలుగురు హీరోల సినిమాలు అన్ని సందర్భాల్లో తనకు నచ్చలేదంటూ సమాధానమిచ్చాడు.
బాలకృష్ణ, చిరంజీవి( ఫేస్బుక్ ఫోటోలు)
మావయ్య బాలయ్య విషయానికొస్తే.. సమరసింహారెడ్డి తర్వాత ఫ్యాక్షన్ కథలంటూ అక్కడే స్ట్రక్ అయ్యారు. గత ఆరేడు ఏళ్ల నుంచి అందులోంచి బయటకు వచ్చి డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. ఐతే చిరంజీవి విషయానికొస్తే.. ఆయన ఎపుడు ఒకే రకమైన పాత్రలు చేయకుండా రకరకాల పాత్రలు చేసుకుంటూ వెళ్లారు. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ చిరంజీవిగారిని వాడుకున్నట్టు మావయ్యను వాడుకోలేదన్నారు. దర్శక, రచయతలు అందరు బాలయ్యకు మాస్ తరహా పాత్రలే సూట అవుతాయి అంటూ ఒకే రకం పాత్రలు ఆయన్నూ వెతుక్కుంటూ వచ్చాయి. ఆయనలోని టాలెంట్‌ను దర్శకులు సరిగా యూజ్ చేసుకోలదని నేను చెబుతున్నాను. ఇప్పటికీ కొత్త దర్శకులు మంచి స్క్రిప్ట్‌తో వస్తే ఆయన్ని కొత్తగా చూడగలం అంటూ సమాధాన మిచ్చాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.