Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: June 3, 2019, 12:50 PM IST
స్నేహా ఉల్లాల్ హాస్పిటల్
అవును.. నందమూరి బాలకృష్ణ హీరోయిన్ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఇంతకీ బాలయ్య హీరోయిన్ అంటే ఎవరా అనుకుంటున్నారా..? సరిగ్గా 9 ఏళ్ల కింద సింహా సినిమాలో బాలయ్యతో నటించిన స్నేహా ఉల్లాల్ గుర్తుంది కదా. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయినా కూడా ఎందుకో మరి తెలుగులో స్నేహాకు మంచి రోజులు రాలేదు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా పట్టించుకోలేదు మన దర్శక నిర్మాతలు. దాంతో బాలీవుడ్ వెళ్లి అక్కడ హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తుంది స్నేహా. అయితే ఉన్నట్లుండి ఈ భామ ఇప్పుడు హాస్పిటల్ పాలైంది.
ఈ మధ్యే తీవ్రమైన జ్వరం కారణంగా స్నేహా ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది స్నేహా ఉల్లాల్. తన జీవితంలో తొలిసారి ఆస్పత్రిలో జాయిన్ అయ్యానని.. ప్రస్తుతానికి బాగున్నానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
జ్వరం మరీ ఎక్కువగా రావడంతో భయమేసింది.. అందుకే హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వచ్చింది.. ఇప్పుడు తన ఆరోగ్యం బాగుంది అంటూ తన క్షేమ సమాచారాన్ని అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆస్పత్రిలో చాలా బోర్ కొడుతుందని.. కానీ తన దగ్గర నెట్ ఫ్లిక్స్ ఉండటంతో పాటు తనను చూసుకోడానికి మనుషులు కూడా ఉన్నారని.. అందుకే ప్రస్తుతానికి బాగానే ఉందని చెప్పుకొచ్చింది స్నేహా ఉల్లాల్.
Published by:
Praveen Kumar Vadla
First published:
June 3, 2019, 12:50 PM IST