హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna | Veera Simha Reddy Trailer : వీరసింహారెడ్డి ట్రైలర్ విడుదల.. ఊరమాస్ డైలాగ్స్‌తో బాలయ్య ఊచకోత..

Balakrishna | Veera Simha Reddy Trailer : వీరసింహారెడ్డి ట్రైలర్ విడుదల.. ఊరమాస్ డైలాగ్స్‌తో బాలయ్య ఊచకోత..

Veera simha reddy Photo : Twitter

Veera simha reddy Photo : Twitter

Balakrishna : బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను చేస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అఖండ సినిమా తర్వాత బాలయ్య (Balakrishna ) వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా  గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది.  జనవరి 12, 2023 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతోంది. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా చేస్తోంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ (Veera Simha Reddy Trailer) ఈరోజు రాత్రి  8: 17 గంటలకు విడుదలైంది. ఫ్యాన్స్‌ ఊహించినట్లుగానే ట్రైలర్‌ కేక పెట్టించింది. ఊరమాస్ డైలాగ్స్‌తో పాటు, యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్‌లో బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్‌తో పాటు భారీ మాస్ యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సన్నివేశాలు అదిరాయి. దీనికి తోడు రిషి పంజాబీ విజువల్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో రేంజ్‌కు తీసుకువెళ్లాయి. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్‌కు అనుకున్న రేంజ్‌లో ట్రైలర్ అదరగొట్టింది.  ఇక ఈ సినిమాలో ముఖ్యంగా ఒక్క డైలాగ్ మాత్రం అందరిని ఆకర్షిస్తోంది. "సంతకాలు పెడితే బోర్డ్ మీద పేరు మారుతుంది ఏమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు". ఇది ఏపీ గవర్నమెంట్‌ను ఉద్దేశించి రాశారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.  ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం ఒంగోలులో గ్రాండ్‌గా జరుగుతోంది. ఇక ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాకు u/a సర్టిఫికేట్ వచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ రెండు గంటల నలభై మూడు నిమిషాలకు లాక్ అయిందని అంటున్నారు.   ఈ సినిమా నుంచి ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే జై బాలయ్య అంటూ ఓ పాట విడుదలవ్వగా ఇక లేటెస్ట్‌‌గా రెండో సింగిల్ సుగుణ సుందరి లిరికల్ సింగిల్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ పాటను బాలయ్య, శృతిహాసన్‌లపై రొమాంటిక్‌గా చిత్రీకరించారు.  అంతేకాదు  ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఇతర ప్రచార చిత్రాలు మంచి ఆదరణ పొందాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య, శృతి హాసన్ ‌తో పాటు దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.  ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు సినిమాలు ఉన్నాయి.. చూడాలి మరి ఈ సినిమాల్లో సంక్రాంతి విన్నర్‌గా ఎవరు నిలవనున్నారో..

ఇక బాలయ్య ప్రధాన పాత్రలో బోయపాటీ శ్రీను దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. డిసెంబర్ 2, 2021లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌‌గా వచ్చిన ఈ చిత్రం హిందీలో కూడా విడుదలకానుందని తెలుస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.  నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు.  శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ, ప్రధాన పాత్రల్లో నటించారు.  థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా  21 జనవరి 2022 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక అది అలా ఉంటే అఖండ ఇప్పుడు హిందీలో భారీగా విడుదలవుతోంది. ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు పెన్ స్టూడియోస్ ఈ సినిమాను అక్కడ భారీగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిర్మాతలు ఓ ఫోస్టర్‌‌తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో సినిమా హిందీలో మంచి వసూళ్లను రాబట్టాలనీ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి అక్కడ ఎలా అఖండ ఆకట్టుకోనుందో.. బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండో సీజన్ అక్టోబర్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

First published:

Tags: Balakirshna, Shruti haasan, Tollywood news, Veera Simha Reddy

ఉత్తమ కథలు