Home /News /movies /

BALAKRISHNA SHARES HIS EXPERIENCE FROM THE SHOOT OF NARATHANA SHALA SR

Balakrishna : నర్తనశాల గురించి బాలయ్య ఆసక్తికర విషయాలు...

బాలయ్య Photo : Youtube

బాలయ్య Photo : Youtube

Balakrishna : నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 17 నిమిషాల ‘నర్తనశాల’ సినిమా ప్రస్తుతం ఏటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

  నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 17 నిమిషాల ‘నర్తనశాల’ సినిమా ప్రస్తుతం ఏటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా మీడియాకు ఓ ఇంటర్వూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన నర్తనశాల సినిమా తీసేసమయంలో జరిగిన కొన్ని సందర్భాలను, అప్పటి విశేషాలను పంచుకున్నాడు. తాను ఎంతో ఇష్టంగా స్వీయ దర్శకత్వంలో 17 యేళ్ల క్రితం ఈ సినిమాను ప్రారంభించాను. అయితే నటి సౌందర్య ఓ యాక్సిడెంట్‌లో మరణించడంతో ఆమె స్థానంలో ఎవరిని పెట్టాలో తెలియక అలా సినిమా ఆగిపోయిందని తెలిపాడు. ఈ సినిమా సౌందర్య ద్రౌపదిగా చేసింది. ఇక మరో నటుడు శ్రీహరి భీముడిగా చేశాడు. ఈ సినిమాలో బాలయ్య అర్జునుడిగా చేశాడు. ఓ వైపుగా నటిస్తూ.. దర్శకత్వం వహించడంతో అప్పటి విశేషాలను పంచుకుంటూ అప్పటి ఎన్టీఆర్ నర్తనశాలను గుర్తు చేసుకుంటూ తన అనుభవాలను తెలియజేశాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఈ సినిమాతో దివికేగిన సౌందర్య, శ్రీహరి వంటి నటులను మళ్లీ భువికి రప్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి గురించి తన మాటల్లో వివరించాడు.

  ఇక ఈ సినిమాను ప్రారంభించిన తర్వాత నటీనటులకు సంబంధించిన 10 రోజలు కాల్షీట్స్ తీసుకున్నాను. అయితే తీయాల్సిన సీన్స్‌ను 5 రోజుల్లో తీసి.. షూటింగ్ పూర్తి చేసినట్టు చెప్పారు బాలయ్య. అందులో 17 నిమిషాలకు సంబంధించిన 2 సన్నివేశాలను పూర్తి చేసినట్టు తెలిపారు. కానీ తానొకటి తలిస్తే.. దైవం ఇంకొటి తలుస్తుందన్నట్టు ఈ సినిమా విషయంలో జరిగిందన్నారు. మొత్తంగా మనం చేసింది ఏది మరుగున పడకూడదు. అలా నాకు ఆలోచన వచ్చిందే తడువుగా నేను డైరెక్ట్ చేసిన 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాను. అలా నర్తనశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చానని తెలిపాడు. నర్తనశాల ప్రస్తుతం శ్రేయాస్ ఈటీ ఏటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. చూడాటానికి 50 రూపాయలు చెల్లించాలి. ఈ 17 నిమిషాల వీడియోలో అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసానికి వెళ్లాల్సిన పాండవుల్లో ఎవరెవరు ఏ వేషాలు వేసుకోవాలి, ఏ విధంగా ఎవరి కంట పడకుండా ఏడాది గడపాలని చర్చించుకునే సీన్‌ను చూపించారు. బాలయ్య ఓ సీన్ లో బృహన్నలగా కనిపిస్తాడు.

  ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో BB3 అనే వర్కింగ్ టైటిల్‌ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ పేరును కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రగ్యా మార్టిన్ మలయాళంలోనే కాకుండా తమిళంలో కూడ పలు సినిమాల్లో నటించింది. తమిళంలో ఆమె మొదటి చిత్రం మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘పిశాసు’. ఈ సినిమా తెలుగులో పిశాచిగా డబ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి గాను ఆమె బెస్ట్ డెబ్యూ నటిగా అవార్డ్ కూడ దక్కింది. ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘లెజెండ్’.. 'సింహ'ను మించి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వస్తోన్న ఈ తాజా సినిమా ‘లెజెండ్’ను మించిన హిట్ అవ్వాలనీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

  కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని సడలింపులతో అనుమతులు ఇవ్వడంతో చిత్రబృందం షూటింగ్‌కు రెడీ అవుతోంది. షూటింగ్‌ను పక్కా ప్లాన్ చేసి సంక్రాంతి బరిలో ఉండాలనీ చిత్రబృందం భావిస్తోందట. తెలుగు సినిమాకి, సంక్రాంతికి వున్న సంబంధం విడదీయరానిది. ఎప్పటి నుంచో సంక్రాంతికి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుండడం మనం చూస్తున్నాం. అసలు సంక్రాంతికి తమ సినిమా విడుదల ఉండడాన్ని స్టార్ హీరోలు ప్రెస్టేజ్ గా కూడా ఫీలవుతారు. అందుకే, ఆ సమయానికి బాలయ్య తన సినిమాను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ షూటింగును సింగిల్ షెడ్యూలులో మొత్తం పూర్తి చేసేస్తారని సమాచారం. దసరాకు ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించే అవకాశం వుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించునేందుకు ప్రయత్నిస్తోందట. అందులో భాగంగా స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ సంస్థ ఏకంగా 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Balakrishna

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు