బాలకృష్ణ ఎపుడైతే..తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించాలనుకున్నాడో..అపుడే ఎన్బీకే ఫిల్మ్స్ స్థాపించాడు. అంతేకాదు ఈ బ్యానర్‌లో ‘ఎన్టీఆర్’ జీవిత చరిత్రను ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా తెరకెక్కించాడు. సినీ జీవిత నేపథ్యంలో తెరకెక్కిన కథానాయకుడు సంక్రాంతి విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న కమర్షియల్‌గా విజయం సాధించలేదు. కథానాయకుడు ఫ్లాప్‌కు ఎన్టీఆర్ జీవితంలో ఎమోషనల్ సన్నివేశాలు ఏవి లేకపోవడంతో ఈ సినిమా నడవలేదని అందరు సరిపెట్టుకున్నారు. కానీ ఎంతో ఎమోషన్‌తో కూడిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాకు కనీస ఓపెనింగ్స్ రాలేదు. ఈ సినిమా మొత్తంగా రూ.5 కోట్లను వసూలు చేయలేక చేతులేత్తేసింది. ఊహించని విధంగా అత్యంత దారణమైన డిజాస్టర్‌ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్‌తో 50 శాతం నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్..రెండో పార్ట్ మహానాయకుడుతో నిండా మునిగిపోయారు. దీంతో ఈసినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
మరోవైపు బాలయ్య..తన తండ్రి బయోపిక్‌తో నిర్మాత అవ్వాలనుకొని ఎన్బీకే ఫిల్మ్స్ ను స్థాపించి తన కలను నెరవేర్చుకున్నాడు. గతంలో బాలయ్య కొన్ని సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించిన నిర్మాతగా ఏ సినిమా నిర్మించలేదు. మరోవైపు వాళ్ల ఓన్ బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ ఉన్న దానికి ఒకప్పుడు హరికృష్ణ, ఆ తర్వాత రామకృష్ణ నిర్మాతలుగా వ్యవహరించారు.
అప్పట్లో బాలయ్య కూడా సొంతంగా సినిమాలు నిర్మించడానికి తన కొడుకు, కూతుళ్ల పేర్లు కలిసేచ్చేటట్టు బ్రహ్మతేజ క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించి సంస్థను రిజిస్టర్ చేయించాడు. ఆతర్వాత తన జాతక రీత్యా సినిమా రంగం కలిసి రాదని తెలుసుకొని సినిమాలు నిర్మించలేదు.
ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు తన తండ్రి బయోపిక్‌తో ఫస్ట్ టైమ్ నిర్మాత అవతారం ఎత్తాడు. తన జీవితంతో వెండితెరపై చరిత్ర సృష్టించాలనకున్న బాలకృష్ణ..ఈ రెండు సినిమాలతో ఆయన కెరీర్లనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా ఫలితం బాలయ్యను బాగా డిసస్పాయింట్ చేసింది. అందుకే నిర్మాతగా తొలి అడుగులోనే ఊహించని పరాజయం ఎదురవ్వడంతో బాలయ్య ఎన్.బి.కే ఫిల్మ్స్ కార్యక్రమాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇప్పట్లో ఆయన నుంచి ఏ సినిమా రాకపోవచ్చని టాక్. మరోవైపు బోయపాటి శ్రీను సినిమా కోసం తానే నిర్మాతగా వ్యవహరించాలనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ ఫలితంతో బోయపాటి శ్రీను సినిమాను వేరే నిర్మాతలతో చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Kirsh, NTR, NTR Biopic, NTR Mahanayakudu, Telugu Cinema, Tollywood