ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరోసారి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..

మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నట రత్న ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా బాలకృష్ణ.. ఎన్టీఆర్ ఘాట్‌లో తన తండ్రికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 28, 2020, 12:16 PM IST
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరోసారి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..
టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు (Twitter/Photo)
  • Share this:

మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నట రత్న ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా బాలకృష్ణ.. ఎన్టీఆర్ ఘాట్‌లో తన తండ్రికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసాడు. వివరాల్లోకి వెళితే... తాజాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు నెలలుగా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ప్రభుత్వంతో  చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ పెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు కరోనా నేపథ్యంలో షరతులతో కూడిన షూటింగ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చాయి. త్వరలోనే షూటింగ్స్ విషయమై టాలీవుడ్ పెద్దలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుంది. అయితే ప్రభుత్వంతో  ఈ చర్చలన్నింటికీ చిరంజీవి ఇల్లు వేదిక కావడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దల భేటి గురించి తనకు తెలియదని బాలయ్య బాంబ్ పేల్చారు. సినిమా షూటింగ్స్ ప్రారంభించే విషయమై ప్రభుత్వంతో చర్చల విషయం తనకు పత్రికల్లో చూసేంత వరకు తెలియదన్నారు.
తండ్రి ఎన్టీఆర్‌కు బాలయ్య ఎన్టీఆర్ నివాళులు (Twitter/Photo)


షూటింగ్స్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ జీవో విడుదల చేయాలని కోరారు. అంతేకాదు జూన్‌లో షూటింగ్స్ ప్రారంభం అవుతాయని అనుకుంటున్నట్టు బాలయ్య అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రారంభమై ఎక్కువ శాతం షూటింగ్ జరిగిన సినిమాలకు ముందుగా అనుమతులు ఇవ్వాలని కోరారు. అంతేకాదు సినీ కార్మికలు సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాదు షూటింగ్స్ సమయంలో అందరు సామాజిక దూరం పాటించాలని కోరారు. ఐతే.. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.

First published: May 28, 2020, 12:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading