హోమ్ /వార్తలు /సినిమా /

సంక్రాంతి ‘బాలయ్య’..పండగ బరిలో ఆయనకు ‘ఎన్టీఆర్’ ఎన్నో సినిమానో తెలుసా ?

సంక్రాంతి ‘బాలయ్య’..పండగ బరిలో ఆయనకు ‘ఎన్టీఆర్’ ఎన్నో సినిమానో తెలుసా ?

45 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్న బాలకృష్ణ నట ప్రస్థానం

45 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్న బాలకృష్ణ నట ప్రస్థానం

తెలుగు సినిమాలకు సంక్రాంతి అతి పెద్ద సీజన్. ఈ పండగ సీజన్‌లో హిట్ కొడితే కలెక్షన్లకు ధోకా వుండదు. అందుకే హీరోలంతా ...ఈ ఫెస్టివల్ టైంలో వాళ్ల చిత్రాలను రిలీజ్ చేయడానికీ ప్లాన్ చేస్తుంటారు. ఇపుడు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాతో మరోసారి బరిలో నిలస్తున్నాడు.

ఇంకా చదవండి ...

  తెలుగు సినిమాలకు సంక్రాంతి అతి పెద్ద సీజన్. ఈ పండగ సీజన్‌లో హిట్ కొడితే కలెక్షన్లకు ధోకా వుండదు. అందుకే హీరోలంతా ...ఈ ఫెస్టివల్ టైంలో వాళ్ల చిత్రాలను రిలీజ్ చేయడానికీ ప్లాన్ చేస్తుంటారు. ప్రెజెంట్ జనరేషన్‌లో సంక్రాంతి హీరోగా నందమూరి నట సింహం బాలయ్యకు ఉన్న ట్రాక్ రికార్డు మరో హీరోకు లేదు.


  మొత్తంగా సంక్రాంతి బరిలో 16 సార్లు తన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించున్నాడు. ఇపుడు 17వ సారి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో మరికాసేట్లో పలకరించబోతున్నాడు.


  ‘ఎన్టీఆర్ కథానాయుకుడు’లో బాలాజీ గెటప్‌లో బాలయ్య


  1985లో ‘ఆత్మ బలం’ సినిమాతో ఫస్ట్ టైమ్ సంక్రాంతి బరిలో నిలిచి ఫ్లాప్‌ను మూట గట్టుకున్నాడు బాలయ్య. ఆ తర్వాత 1987లో రెండో సారి పొంగల్ పోటీలో ‘భార్గవ రాముడు’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’, ‘ప్రాణానికి ప్రాణం’, ‘వంశానికొక్కడు’ , ‘పెద్దన్నయ్య’, ‘సమర సింహారెడ్డి’, ‘వంశోద్దారకుడు’, ‘నరసింహానాయుడు’, ‘సీమ సింహం’, ‘లక్ష్మీ నరసింహా’, ‘ఒక్క మగాడు’, ‘పరమ వీర చక్ర’, ‘డిక్టేటర్’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘జై సింహా’ వంటి సినిమాలతో సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు.


  జై సింహాగా బాలయ్య


  సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ‘భార్గవ రాముడు’, ‘ప్రాణానికి ప్రాణం’ ‘వంశానికొక్కడు’, ‘పెద్దన్నయ్య’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహా నాయుడు’, ‘లక్ష్మీ నరసింహా’ ‘డిక్టేటర్’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘జై సింహా’ వంటి 10 సినిమాలతో హిట్ అందుకున్నాడు. మిగిలిన ఆరు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి.


  Balakrishna’s NTR Kathanayakudu Vendithera Dora Lyrical Video song Released
  ‘ఎన్టీఆర్’ లో బాలకృష్ణ


  ఇపుడు 17వ సారి తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాతో మరోసారి సంక్రాంతి బరిలో నిలిచాడు.


  Mahanati challenging NTR Biopic.. will Kathanayakudu reach it..? తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు బ‌యోపిక్స్ చాలా అరుదుగా వ‌చ్చేవి. అస‌లు వ‌చ్చాయి అనేకంటే కూడా రాలేద‌ని చెప్ప‌డ‌మే ఉత్త‌మ‌మేమో..? వ‌చ్చిన ఒక‌టి రెండు సినిమాలు కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. టాలీవుడ్‌లో బ‌యోపిక్స్ ట్రెండ్‌కు తెర‌తీసిన సినిమా ‘మ‌హాన‌టి’. ఇప్పుడు వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయిప్పుడు. దాంతో పాటు చాలా సవాళ్లను ఎదుర్కొంటూ వస్తుంది ఎన్టీఆర్ బయోపిక్. mahanati ntr biopic comparison,ntr biopic,ntr biopic mahanati,ntr savitri,kathanayakudu mahanati,krish nag ashwin,kathtnayakudu mahanayakudu,ntr biopic mahanati movie,telugu cinema,మహానటి ఎన్టీఆర్ బయోపిక్,కథానాయకుడు మహానటి,కథానాయకుడికి సావిత్రి సవాల్,ఎన్టీఆర్ కథానాయకుడు మహానటి సినిమా,నాగ్ అశ్విన్ క్రిష్,క్రిష్ మహానాయకుడు కథానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్‌కు ఎన్నో సవాళ్లు,మహానటి ఎన్టీఆర్ బయోపిక్ సవాల్,తెలుగు సినిమా
  ‘ఎన్టీఆర్.. మహానాయకుడు’


  క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో బాలయ్య మొదటి సారి పూర్తిస్థాయి నిర్మాత అవతారం ఎత్తారు. విద్యాబాలన్ కథానాయికగా నటిస్తోన్న ఈసినిమాలో టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మరి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో బాలకృష్ణ.. సంక్రాంతి హీరో అనిపించుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.


   

  First published:

  Tags: Bala Krishna Nandamuri, NTR Biopic, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు