బాలకృష్ణ రూలర్ రెండు రోజుల కలెక్షన్స్.. బయ్యర్లకు వణుకు..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన రూలర్ సినిమాకు టాక్ తేడాగా వచ్చింది. తొలిరోజే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా ఆశించినంతగా రావడం లేదు. ఈ చిత్రం తొలిరోజు రెండు రాష్ట్రాల్లో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 22, 2019, 9:33 AM IST
బాలకృష్ణ రూలర్ రెండు రోజుల కలెక్షన్స్.. బయ్యర్లకు వణుకు..
‘రూలర్’లో బాలకృష్ణ (Twitter/Photo)
  • Share this:
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన రూలర్ సినిమాకు టాక్ తేడాగా వచ్చింది. తొలిరోజే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా ఆశించినంతగా రావడం లేదు. ఈ చిత్రం తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.29 కోట్ల షేర్ వసూలు చేసింది. బాలయ్య ఇమేజ్‌తో పోలిస్తే ఇవి తక్కువ వసూళ్లే. ఇక రెండోరోజు కూడా బాలయ్య తన స్టామినా చూపించాడు. నెగిటివ్ టాక్‌తో కూడా రెండో రోజు దాదాపు 2.5 కోట్ల వరకు షేర్ రాబట్టాడు. మాస్ సినిమా కావడంతో బి, సి సెంటర్స్‌లో రూలర్ పర్లేదనిపిస్తుంది. ఓపెనింగ్స్ వరకు బాలయ్య తన సత్తా చూపిస్తున్నాడు కానీ లాంగ్ రన్ మాత్రం కష్టమే.
Balakrishna Ruler movie 2 days Worldwide collections and another flop for Mass Hero pk నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన రూలర్ సినిమాకు టాక్ తేడాగా వచ్చింది. తొలిరోజే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా ఆశించినంతగా రావడం లేదు. ఈ చిత్రం తొలిరోజు రెండు రాష్ట్రాల్లో.. ruler movie,balakrishna ruler movie,balakrishna ruler movie collections,balakrishna ruler movie 2 days collections,balakrishna ruler movie 2 days ap ts collections,balakrishna ruler movie ww collections,balakrishna ruler movie 2 days ww collections,telugu cinema,బాలయ్య,బాలకృష్ణ రూలర్,రూలర్ కలెక్షన్స్,రూలర్ 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
బాలయ్య రూలర్

కేయస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు తక్కువగానే ఉన్నాయి. పైగా తక్కువ స్క్రీన్స్‌లో విడుదలైంది రూలర్. దాంతో కలెక్షన్ పరంగా వెనకబడిపోయాడు బాలయ్య. జై సింహ హిట్ అయినా కూడా ఈ సారి మాత్రం నిరాశ తప్పేలా లేదు. సోనాల్ చౌహాన్, వేదిక అందాల ఆరబోత కూడా రూలర్ సినిమాను కాపాడలేకపోతుంది. మూడు రోజుల తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది రూలర్ భవిష్యత్తును డిసైడ్ చేయనుంది. ప్రస్తుతానికి అయితే రెండు రోజుల్లో వసూళ్ళు పర్లేదు. ఓవర్సీస్‌లో మాత్రం రూలర్ పూర్తిగా నిరాశ పరిచింది.
Published by: Praveen Kumar Vadla
First published: December 22, 2019, 9:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading