బాలయ్య రికార్డును సమం చేసిన హీరోయిన్.. ఇంతకీ ఏ విషయంలో తెలుసా...

బాలకృష్ణ అప్పట్లో క్రియేట్ చేసిన ఒక అరుదైన రికార్డును ఈ హీరోయిన్ సమం చేసింది. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: January 16, 2020, 10:53 AM IST
బాలయ్య రికార్డును సమం చేసిన హీరోయిన్.. ఇంతకీ ఏ విషయంలో తెలుసా...
నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)
  • Share this:
బాలకృష్ణ అప్పట్లో క్రియేట్ చేసిన ఒక అరుదైన రికార్డును ఈ హీరోయిన్ సమం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఈ మధ్యకాలంలో మన హీరోలు యేడాదికి ఒకటికి రెండు సినిమాలు చేస్తే గొప్ప. అటువంటిది ఒక టాప్ హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం చాలా రేర్ అనే చెప్పాలి. అటువంటి రేర్ ఫీట్ చేసిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. 1993 సెప్టెంబర్ 3న  నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన  ‘నిప్పురవ్వ’, ‘బంగారు బుల్లోడు’ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల్లో  ‘నిప్పురవ్వ’ మూవీ యావరేజ్‌గా నడిస్తే...‘బంగారు బుల్లోడు’ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలు ఒకే రోజు రిలీజైయ్యాయి. పాత తరంలో మాత్రం ఎన్టీఆర్, కృష్ణ నటించిన చాలా సినిమాలు ఒకే రోజు విడుదలైన సందర్భాలున్నాయి. ఇప్పటి తరంలో ఒకే రోజు రెండు సినిమాలనేవి ఇలాంటివి ఊహించడం కష్టమే. కానీ మోహ్రీన్ కౌర్ మాత్రం ఒకేరోజు ఆమె యాక్ట్ చేసిన రెండు సినిమాలను విడుదలయ్యాయి.

balakrishna record broken by mehreen kaur here are the details,balakrishna,balakrishna nandamuri,balayya,nbk,mehreen kaur,mehreen kaur entha manchivaadavuraa patas,mehreen balakrishna dhanush kalyan ram,tollywood,telugu cinema,entha manchivaadavuraa movie review,balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,tollywood,kollywood,బాలయ్య,బాలకృష్ణ,మెహ్రీన్ కౌర్,బాలకృష్ణ మెహ్రీన్ కౌర్,మెహ్రీన్ కౌర్ పటాస్ ఎంత మంచివాడవురా, బాలకృష్ణ మెహ్రీన్ కౌర్
బాలకృష్ణ,మెహ్రీన్ కౌర్ (Twitter/Photo)


ఆమె కళ్యాణ్ రామ్‌కు జోడిగా నటించిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా తెలుగులో సంక్రాంతి రోజున విడుదలైంది. మరోవైపు తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘పటాస్’ కూడా సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజైంది. ఈ రకంగా ఈ తరంలో మెహ్రీన్ కౌర్హీ నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం అనేది చాలా రేర్ అనే చెప్పాలి. అప్పట్లో బాలయ్య, ఆ తర్వాత నానికి మాత్రమే సాధ్యమైన ఈ రికార్డు ఇపుడు మెహ్రీన్ కౌర్‌కు సొంతం అయింది.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు