బాలకృష్ణ, రవితేజ బాటలోనే సమంత నడుస్తోంది. ఇంట్లో అక్కినేని హీరోలు ఉండగా.. బయటి హీరోల బాటలో సమంత నడవడం ఏమిటి అనకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే.. ఆడవాళ్ల వయస్సు..మగవాళ్ల ఆదాయం అడక్కూడనేది మన దగ్గర పాత సామెత ఉంది. సినీ ఇండస్ట్రీ విషయానికొస్తే..హీరోయిన్స్ రెమ్యూనరేషన్..హీరోల వయసు అడక్కూడదు. వయసు దాచేయడంలో మన హీరోలు ...హీరోయిన్స్‌తో పోటీ పడుతుంటారు. అందుకే మన కథానాయకులు తలకు ఇంత నల్ల రంగేసుకొని, ముఖానా ఉన్న ముడతల్ని మేకప్‌తో ప్యాకప్ చేసేసి నవ మన్మథుల్లా సిల్వర్ స్ర్కీన్‌పై ఒక వెలుగుతున్నారు. ఇపుడీ ఈ ట్రెండ్‌కు విరుద్దంగా మన హీరోలు, హీరోయిన్లు ఎక్కువ వయసున్న పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలకృష్ణ..తన వయసుకున్న తక్కువున్న పాత్రతో పాటు ఎక్కువ వయసున్న తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించాడు.
‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’
ఇక రవితేజ కూడా ‘డిస్కోరాజా’ సినిమాలో వయసు మళ్లిన పాత్రతో పాటు యంగ్ క్యారెక్టర్లో నటించనున్నాడు. ఒక ఎక్స్‌పెరిమెంట్‌తో ముసలివాడిగా ఉన్న రవితేజ యంగ్‌గా మారి తనకు అన్యాయం చేసిన వాళ్లపై పగ తీర్చుకుంటడనేది ఈ సినిమా స్టోరీ.
డిస్కో రాజా టైటిల్
మరోవైపు సమంత కూడా..కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’ తెలుగు రీమేక్ ‘ఓ బేబి’లో తన వయసు మళ్లిన బామ్మ పాత్రలో నటిస్తోంది. అనుకోకుండా ఈ ముసలావిడా పదహారేళ్ల పడుచుగా ఎలా మారిపోయిందనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సమంత, రవితేజ చేయబోయే కథలు ఒకే రకంగా ఉన్నాయి.
మిస్ గ్రానీ సమంత
మరో హీరో శర్వానంద్ కూడా సుధీర్ వర్మ దర్శకత్వంలో చేయబోయే సినిమాలు వయసు మళ్లిన అరవైయేళ్ల ముసలి పాత్రలోనే కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేస్తోన్న ‘భారతీయుడు2’లో కూడా లోక నాయకుడు వయసుని మించిన పాత్రలో మరోసారి నటిస్తున్నాడు. ఇప్పటికే ‘భారతీయుడు’లో ఆ పాత్రను ఆయన ఎలా పండించాడో చూసాము కదా.
భారతీయుడు 2లో కమల్ హాసన్
అంతకు ముందు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘2.O’ సినిమాలో అక్షయ్ కుమార్ వయసు మళ్లిన పక్షిరాజు పాత్రలో జీవించాడు. మొత్తానికి చాలా మంది హీరోలు తమ వయసుకు మించిన పాత్రలతో ఆడియన్స్‌ను అలరించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.