Home /News /movies /

BALAKRISHNA RAM CHARAN FOLLOWS NBK IN THIS WAY RRR HERO GOT SUCCESS IN THIS WAY HERE ARE THE DETAILS TA

Balakrishna - Ram Charan : బాలకృష్ణ రూట్లో రామ్ చరణ్.. బాలయ్యలా అక్కడ చెర్రీ సక్సెస్ సాధిస్తాడా.. ?

నందమూరి బాలకృష్ణ,రామ్  చరణ్ (File/Photo)

నందమూరి బాలకృష్ణ,రామ్ చరణ్ (File/Photo)

Balakrishna - Ram Charan : నందమూరి బాలకృష్ణ  బాటలో రామ్ చరణ్.. అవును మెగా పవర్ స్టార్ ఇపుడు నట సింహాం బాటలో ఆ పని చేయడానికి రెడీ అవుతున్నారు. మరి అందులో సక్సెస్ అందుకుంటారా వివరాల్లోకి వెళితే..

    Balakrishna - Ram Charan : నందమూరి బాలకృష్ణ  బాటలో రామ్ చరణ్.. అవును మెగా పవర్ స్టార్ ఇపుడు నట సింహాం బాటలో ఆ పని చేయడానికి రెడీ అవుతున్నారు. అవును ఈ మధ్య కాలంలో మన హీరోలు కేవలం సినిమాలే కాకుండా.. ఓటీటీ వేదికగా ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, రానా వంటి హీరోలు .. స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. ఇక నందమూరి నట సింహం బాలకృష్ణ .. ఆహా ఓటీటీ వేదికగా యాంకర్ అవతారం ఎత్తి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు  చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ షో సూపర్ హిట్టైయింది. అంతేకాదు దేశంలో నెంబర్ టాక్ షోగా సత్తా చాటింది. అంతేకాదు IMDBలో ఈ టాక్ షో 9.7 /10 రేటింగ్ సాధించింది. ఇపుడు అదే రూట్లో రామ్ చరణ్ కూడా త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

    ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్, రానాలతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తున్నారు. ఇక నాగ చైతన్య కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.  తాజాగా రామ్ చరణ్ .. కూడా ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్‌ కోసం రామ్ చరణ్‌ను సంప్రదించినట్టు సమాచారం. ముందుగా ఓ బాలీవుడ్ స్టార్‌తో ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్‌ను రీమేక్‌ చేయాలనుకున్నారట.  కానీ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్‌కు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అందుకే ఈ సిరీస్‌ను చెర్రీతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దీనికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

    Balakrishna Ram Charan Follows NBK In This Way Here Are the Details,Balakrishna - Ram Charan : బాలయ్య బాటలో రామ్ చరణ్.. నట సింహాన్ని ఆ విధంగా ఫాలో అవుతున్న మెగా పవర్ స్టార్..,Balakrishna,Ram Charan,Balakrishna OTT,Balakrishna Ram Charan,Ram Charan Follows Balakrishna,Ram Charan Entry into OTT,Tollywood,Telugu Cinema,బాలకృష్ణ,బాలకృష్ణ నందమూరి, రామ్ చరణ్,రామ్ చరణ్ బాలకృష్ణ,ఓటీటీ ఎంట్రీ ఇస్తోన్న రామ్ చరణ్,బాలకృష్ణ ఆహా ఓటీటీ,
    నందమూరి బాలకృష్ణ,రామ్ చరణ్ (File/Photo)


    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. మొదటి రోజు.. రూ. 230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో మన దేశంలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది.  ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించారు. మరోవైపు రామ్ చరణ్ .. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 29న  విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు.  ప్రస్తుతం రామ్ చరణ్ .. తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను శంకర్ సరికొత్త కాన్సెప్ట్‌తో తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు ’సర్కారోడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

    Ram Charan Shankar film update, Prashant Neel to direct Ram Charan, Ram Charan Gowtam Tinnanuri,Gowtam Tinnanuri Prabhas UV Creation,Ram charan Twitter, RRR Release Date postponed, NTR Ram Charan Rajamouli RRR Release Date , Prabhas Twitter,Prabhas Facebook,Ram charan instagram,prabhas instagram,tollywood,ప్రభాస్,రామ్ చరణ్,ప్రభాస్ రామ్ చరణ్
    రామ్ చరణ్, శంకర్ మూవీ (File/Photo)


    అటు శంకర్ సినిమా చేస్తూనే.. రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నారు. ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను స్పోర్ట్స్ అండ్ యాక్షన్ నేపథ్యంలో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.  ఇక గౌతమ్ తిన్ననూరి సినిమాను  శంకర్ సినిమాతో పాటే చేయాలనే ఆలోచనలో ఉన్నారు రామ్ చరణ్.

    500 crore grossed Indian movies: ‘RRR’ సహా.. 500 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించిన 13 ఇండియన్ సినిమాలు ఇవే..


    ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్’ సినిమాతో ఆకట్టుకున్న రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం. రీసెంట్‌గా ఈ సినిమా చూసి రామ్ చరణ్ మెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో మంచి కథ ఉంటే రాహుల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తానని  చెప్పాడట. త్వరలో వీళ్ల కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, NBK 107, Ram Charan, RRR, Tollywood

    తదుపరి వార్తలు