హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna - Ram Charan : బాలయ్య బాటలో రామ్ చరణ్.. నట సింహాన్ని ఆ విధంగా ఫాలో అవుతున్న మెగా పవర్ స్టార్..

Balakrishna - Ram Charan : బాలయ్య బాటలో రామ్ చరణ్.. నట సింహాన్ని ఆ విధంగా ఫాలో అవుతున్న మెగా పవర్ స్టార్..

నందమూరి బాలకృష్ణ,రామ్  చరణ్ (File/Photo)

నందమూరి బాలకృష్ణ,రామ్ చరణ్ (File/Photo)

Balakrishna - Ram Charan : నందమూరి బాలకృష్ణ  బాటలో రామ్ చరణ్.. అవును మెగా పవర్ స్టార్ ఇపుడు నట సింహాం బాటలో ఆ పని చేయడానికి రెడీ అవుతున్నారు.

    Balakrishna - Ram Charan : నందమూరి బాలకృష్ణ  బాటలో రామ్ చరణ్.. అవును మెగా పవర్ స్టార్ ఇపుడు నట సింహాం బాటలో ఆ పని చేయడానికి రెడీ అవుతున్నారు. అవును ఈ మధ్య కాలంలో మన హీరోలు కేవలం సినిమాలే కాకుండా.. ఓటీటీ వేదికగా ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, రానా వంటి హీరోలు .. స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. రీసెంట్‌గా నందమూరి నట సింహం బాలకృష్ణ .. ఆహా ఓటీటీ వేదికగా యాంకర్ అవతారం ఎత్తి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు  చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ షో సూపర్ హిట్టైయింది. అంతేకాదు దేశంలో నెంబర్ టాక్ షోగా సత్తా చాటింది. అంతేకాదు IMDBలో ఈ టాక్ షో 9.7 /10 రేటింగ్ సాధించింది. ఇపుడు అదే రూట్లో రామ్ చరణ్ కూడా త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

    ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్, రానాలతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తున్నారు. ఇక నాగ చైతన్య కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.  తాజాగా రామ్ చరణ్ .. కూడా ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్‌ కోసం రామ్ చరణ్‌ను సంప్రదించినట్టు సమాచారం. ముందుగా ఓ బాలీవుడ్ స్టార్‌తో ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్‌ను రీమేక్‌ చేయాలనుకున్నారట.  కానీ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్‌కు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అందుకే ఈ సిరీస్‌ను చెర్రీతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దీనికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

    నందమూరి బాలకృష్ణ,రామ్ చరణ్ (File/Photo)

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..  ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అంతా బాగుంటే..  ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదలై ఉండేది.  కానీ ఓమైక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు.  ఈ సినిమాను మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    Bigg Boss Telugu OTT : బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ ప్రోమో విడుదల.. వకీల్‌సాబ్‌గా నాగార్జున లుక్ అదుర్స్..

    మరోవైపు రామ్ చరణ్ .. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 29న  విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు పూర్తయ్యాయి. కాబట్టి.. ప్రస్తుతం రామ్ చరణ్ .. తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను శంకర్ సరికొత్త కాన్సెప్ట్‌తో తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నారు.

    Ram Charan Shankar film update, Prashant Neel to direct Ram Charan, Ram Charan Gowtam Tinnanuri,Gowtam Tinnanuri Prabhas UV Creation,Ram charan Twitter, RRR Release Date postponed, NTR Ram Charan Rajamouli RRR Release Date , Prabhas Twitter,Prabhas Facebook,Ram charan instagram,prabhas instagram,tollywood,ప్రభాస్,రామ్ చరణ్,ప్రభాస్ రామ్ చరణ్
    రామ్ చరణ్, శంకర్ మూవీ (File/Photo)

    అటు శంకర్ సినిమా చేస్తూనే.. రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నారు. ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను స్పోర్ట్స్ అండ్ యాక్షన్ నేపథ్యంలో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.  ఇక గౌతమ్ తిన్ననూరి సినిమాను  శంకర్ సినిమాతో పాటే చేయాలనే ఆలోచనలో ఉన్నారు రామ్ చరణ్.

    Prabhas : పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల దూకుడు మాములుగా లేదుగా.. ప్రభాస్ నెక్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసిన అమ్మడు..

    ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్’ సినిమాతో ఆకట్టుకున్న రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం. రీసెంట్‌గా ఈ సినిమా చూసి రామ్ చరణ్ మెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో మంచి కథ ఉంటే రాహుల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తానని  చెప్పాడట. త్వరలో వీళ్ల కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, Ott, Ram Charan, Tollywood

    ఉత్తమ కథలు