Balakrishna - Rajamouli : నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. ఇంకోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని బాలయ్య ..బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ మూవీతో అఖండమైన విజయం అందుకొని జోరుమీదున్నారు. అదే జోష్‌లో అన్‌స్టాపబుల్ కూడా పూర్తి చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే సీజన్ 1లో భాగంగా 4 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. అలాగే వరసగా ఎపిసోడ్స్ షూట్ చేస్తూనే ఉన్నాడు బాలయ్య. ఇప్పటికీ మహేష్ బాబు (Mahesh Babu) ఎపిసోడ్ ఎయిర్ కాలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది.
మహేష్ బాబు కంటే ముందే మరో ఎపిసోడ్ కూడా షూట్ చేసారు బాలయ్య. దానికి రాజమౌళి, కీరవాణి వచ్చారు. దీనికి సంబంధించిన స్టిల్స్‌ను విడుదల చేసారు. తాజాగా ఈ ఎపిపోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమోలో రాజమౌళిని బాలయ్య ఆసక్తికర ప్రశ్నలు వేసారు.
Promo lone anni cheppestama enti?
Samadhaanalu, sandadi kavalante full episode kosam wait cheyalsinde!
The men behind the biggest Indian movie on the biggest ever talk show#UnstoppableWithNBK Ep 5 Promo out now! Premieres Dec 17.#SSROnUnstoppableWithNBK#NandamuriBalakrishna pic.twitter.com/DRDQQxrAac
— ahavideoIN (@ahavideoIN) December 15, 2021
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. మీరు ఆల్రెడీ ఇంటిలిజెంట్ అని.. అఛీవర్ అని.. అందరికీ తెలుసు. మరి ఎందుకీ తెల్ల గెడ్డం అంటూ ప్రశ్నించారు. దానికి రాజమౌళి.. గడ్డంపై చేయివేయి అటు ఇటు తిప్పారు. మరోవైపు బాలయ్య మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మన కాంబినేషన్ పడలేదు. నా అభిమానులు మీతో సినిమా ఎపుడు చేస్తారని అడిగారు. దానికి మీ సమాధానం ఏంటి అసలు అని బాలయ్య అడగానే.. జక్కన్న తన మీసాలను అటూ ఇటూ తిప్పారే కానీ సమాధానం ఇవ్వలేదు. మీతో సినిమా చేస్తే.. హీరోకు, ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్లు రెండు మూడు సినిమాలు ఫసకే కదా అని బాలయ్య ప్రశ్నించగా.. రాజమౌళి మాత్రం తలపై చేయి వేసుకొని మౌనమునిలా ఉండిపోయారు.
NBK - Akhanda : బెజవాడ కనకదుర్గమ్మ మరియు పానకాల నరసింహా స్వామిని దర్శించుకున్న ‘అఖండ’ టీమ్..
జక్కన్న ఎక్స్ప్రెషన్స్కు బాలయ్య కూడా అదే రేంజ్లో చిత్ర విచిత్రంగా ముఖం పెట్టారు. సమాధానాలు చెప్పరేంటి రాజమౌళి అని బాలయ్య గుచ్చి గుచ్చి అడగానే.. మీకు తెలుసు.. నాకు తెలుసు.. షూట్ చేసే వాళ్లకు తెలుసు.. ఇది ప్రోమో అని.. దానికి బాలయ్య నాలుక కరుచుకున్నారు. అంతేకాదు మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు ఎపిసోడ్‌లోనే సమాధానాలు చెబుతా అన్నారు జక్కన్న. మొత్తంగా రాజమౌళితో బాలయ్య ఎపిసోడ్ ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఈ టాక్ షో డిసెంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది.
ఈ ఎపిసోడ్లో రాజమౌళితో పాటు వాళ్ల అన్నయ్య కీరవాణి కూడా పార్టిసిపేట్ చేయనున్నారు.ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఇందులో బాలయ్యతో పంచుకున్నారు రాజమౌళి, కీరవాణి. ఎపిసోడ్ 5 ఇదే అంటూ ఆహా టీమ్ కూడా అధికారికంగా ప్రకటించింది.
Akhanda : అఖండ దూకుడు ముందు ఐదేళ్ల ఆ రికార్డ్ ఫసక్.. బాలకృష్ణ మాస్ బీభత్సం..
ఆహాలో అత్యధిక వ్యూస్ తీసుకొస్తున్న షోగా ఇది రికార్డులు తిరగరాస్తుంది. పైగా బాలయ్య హోస్టింగ్ కూడా కేక పెట్టిస్తుంది. తనను తాను చాలా మార్చుకున్నాడు బాలయ్య. తనకంటే తక్కువ ఇమేజ్ ఉన్న నటులు వచ్చినపుడు కూడా ఎంతో బాగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా.. వాళ్లపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Akhanda - NBK : బాలకృష్ణ ‘అఖండ’ డిజిటల్ స్ట్రీమింగ్.. శాటిలైట్ ప్రసారానికి ముహూర్తం ఖరారు.. ?
ముఖ్యంగా మొన్న బ్రహ్మానందం ఎపిసోడ్లో అయితే బాలయ్య కామెడీ అదుర్స్. అందుకే ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి కూడా రావడంతో మరింత ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
RRR : ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. 100 మిలియన్స్ వ్యూస్ దాటిన ట్రైలర్..
ట్రిపుల్ ఆర్ విడుదలకు ముందు ఈ ఎపిసోడ్ ప్రమోషన్లా పనికొస్తుంది. ఈ క్రమంలోనే మరికొందరు ప్రముఖులను ఈ టాక్‌షోకు రప్పించనున్నాడు బాలయ్య. చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్లు కూడా ఈ షోకు వస్తారనే ప్రచారం జరుగుతుంది. రాజమౌళి తర్వాత విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ అన్స్టాపబుల్కు రాబోతున్నట్లు తెలుస్తుంది. (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhanda movie, Balakrishna, Balayya, NBK, Rajamouli, Roudram Ranam Rudhiram, RRR, Tollywood, Unstoppable NBK