Neha Dhupia: మగబిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య భామ నేహా ధూపియా.. ఫొటోలు షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సోహా అలీ ఖాన్

నేహా ధూపియా (Instagram/Photo()

బాలీవుడ్‌ నటి నేహా ధూపియా ఆదివారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభ సందర్భంలో నేహా ధూపియా స్నేహితురాలు, మరోనటి సోహా అలీ ఖాన్ నేహా ధూపియాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది.

  • Share this:
Neha Dhupia: బాలీవుడ్‌ నటి నేహా ధూపియా ఆదివారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఆమె భర్త అంగద్ బేడీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించారు. దీంతో ఈ జంటకు స్నేహితులు, బంధువులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ శుభ సందర్భంలో నేహా ధూపియా స్నేహితురాలు, మరోనటి సోహా అలీ ఖాన్ సైతం ఈ జంటకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. ఇటీవల జరిగిన ఒక బర్త్ డే పార్టీకి, ఆస్పత్రిలో ఉన్న నేహాకి సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఒక ఫొటోలో సోహా అలీ ఖాన్ కుమార్తె ఇనాయ (Inaaya) నేహా గర్భాన్ని ముద్దుపెట్టుకుంటూ కనిపించింది. రెండో ఫొటోలో ఆస్పత్రి బెడ్ లో ఉన్న నేహా ఆమె వెనుక సోహా కనిపించింది. ఈ పోస్టులో ఆమె నేహాకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈరోజు సోహా బర్త్‌డే సైతం కావడం విశేషం. ఈ ముద్దుగుమ్మ సోమవారం 43వ వసంతంలోకి అడుగుపెట్టింది. తన బర్త్ డే ఒకరోజు ఉందనగా నేహా కుమారుడు ఈ ప్రపంచంలోకి రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తన ప్రేమ, ఆశీర్వాదాలు తల్లీబిడ్డలకు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొంది.








View this post on Instagram






A post shared by Soha (@sakpataudi)





నేహా ధూపియా బాలీవుడ్‌తో పాటు ఎన్నో భాషల్లో నటించింది. బాలకృష్ణ (Balakrishna) హీరోగా దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) దర్శకత్వంలో వచ్చిన పరమవీరచక్ర (Parama Veera Chakra) సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. పంజాబీ, జపనీస్, మలయాళం వంటి చిత్రాల్లో కూడా ఆమె నటించి విశేషమైన పేరు తెచ్చుకుంది. 2018లో నటుడు అంగద్ బేడీని ఈమె ప్రేమ వివాహం చేసుకుంది. నవంబర్ 18, 2018లో ఆమెకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఈసారి ఆమెకు బాబు పుట్టాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్.. నేహాకి మంచి స్నేహితురాలు. సోహా హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది.

Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

అంతకు ముందు రోజు నేహా భర్త అంగద్ బేడీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘బేడీస్ బాయ్ వచ్చేశాడు. దేవుడు మాకు ఈ రోజు మగబిడ్డను ప్రసాదించారు. నేహా, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. మా బిడ్డ మెహర్ తన తమ్ముడికి 'బేబీ' టైటిల్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ మధురమైన క్షణాలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేద్దాం" అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేహా మీడియాతో మాట్లాడింది. రెండవసారి జన్మనివ్వడం మొదటిసారి కంటే చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చింది.
Published by:Kiran Kumar Thanjavur
First published: