Home /News /movies /

BALAKRISHNA NTR NBK SPECIAL INVITES ABBAYI NTR TO AKHANDA PRE RELEASE FUNCTION TA

Balakrishna - NTR : ‘అఖండ’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అబ్బాయి ఎన్టీఆర్‌కు బాబాయి బాలకృష్ణ ఆహ్వానం..

బాలకృష్ణ, ఎన్టీఆర్ (Twitter/Photo)

బాలకృష్ణ, ఎన్టీఆర్ (Twitter/Photo)

Balakrishna - NTR : ‘అఖండ’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అబ్బాయి ఎన్టీఆర్‌కు బాబాయి బాలకృష్ణ ఆహ్వానించారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

    Balakrishna - NTR : ‘అఖండ’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అబ్బాయి ఎన్టీఆర్‌కు బాబాయి బాలకృష్ణ ఆహ్వానించారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా విషయానికొస్తే.. బోయపాటి శ్రీను ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’  బ్లాక్ బస్టర్స్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. రీసెంట్‌గా విడులైన ఈ సినిమా ట్రైలర్‌తో ఈ సినిమాపై ఆ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయనే చెప్పాలి. ముఖ్యంగా బాలయ్య అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని హంగులు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 17 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.

    సీనియర్ టాప్ హీరోల్లో ఈ రేంజ్‌లో వ్యూస్ దక్కించుకున్న హీరోగా ఎవరు లేరు. అందులోను బాలయ్య సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బాలయ్య అఘోర గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావాలని బాలయ్య.. తన అన్నయ్య తనయుడు ఎన్టీఆర్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇక బాబాయి పిలుపుతో ఎన్టీఆర్ ఎంతో ఆనందంగా ఫీలవుతున్నారు. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈ నెల 27 లేదా 28న హైదరాబాద్‌లో నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారు.

    Celebrities Marriages 2021 : సునీత, ప్రణీత, శ్రద్ధా ఆర్య సహా ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కిన సినీ సెలబ్రిటీలు వీళ్లే..


    ఆ మధ్యకాలంలో ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా సక్సెస్ మీట్‌‌కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరై మూవీ యూనిట్‌కు మెమెంటోలు అందించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత బాలయ్య.. తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ హాజరయ్యారు. తాజాగా మరోసారి బాబాయి నటించిన ‘అఖండ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అయింది. అమెరికాలో ఓ రోజు ముందు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా స్క్రీనింగ్ కానుంది.

    NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: నాగార్జున, చిరంజీవి,ఎన్టీఆర్, బాలకృష్ణ సహా స్మాల్ స్క్రీన్ పై సందడి చేసిన టాప్ స్టార్స్..

    అంతేకాదు ఈ సినిమాలో నందమూరి నట సింహం.. అఘోర కాకుండా మరో రెండు పాత్రల్లో అలరించనున్నట్టు సమాచారం. మొత్తంగా బాలయ్య ఈ సినిమాలో ఎన్ని పాత్రల్లో నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన  ‘అఖండ’చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    Bollywood Heroes in South: అజయ్ దేవ్‌గణ్, సంజయ్ దత్, సల్మాన్ ఒకరి తర్వాత మరొకరు.. సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరోల దందా..


    ఇందులో బాలయ్య డైలాగులు కూడా అదిరిపోయాయి. అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టుసీమ తూమా.. ఒక మాట నువ్వంటే శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. దైవ శాసనం.. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్‌డోజర్‌ని.. తొక్కిపారదొబ్బుతా.. మీకు ఏదైనా సమస్య వస్తే దండం పెడతారు..  మేమా సమస్యకు పిండం పెడతామంటూ బాలయ్య చెప్పిన డైలాగులు పేలాయి. మొత్తంగా ట్రైలర్‌తో సంచలనాలు నమోదు చేసిన ‘అఖండ’ రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, Boyapati Srinu, Jr ntr, NBK, RRR, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు