కథానాయకుడు ఫ్లాప్ తర్వాత మహానాయకుడు సినిమాపై నిజంగానే అంచనాలు తగ్గిపోయాయి. కానీ ఈ చిత్రంతో కచ్చితంగా తానేంటో చూపిస్తానంటున్నాడు బాలయ్య. ఇప్పుడు ఈ చిత్ర సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగంగా ఎన్టీఆర్ మహానాయకుడు వస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ అందుకుంది ఈ చిత్రం. ఫిబ్రవరి 22న భారీ అంచనాల మధ్య మహానాయకుడు సినిమా విడుదల కానుంది.
ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. నందమూరి బాలకృష్ణ NBK ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను నిర్మించారు. సినిమా సెన్సార్ రివ్యూ ప్రకారం చాలా ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా సాగిందని తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్లు బాగా వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.
కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందని ధీమాగా చెబుతున్నాడు దర్శకుడు క్రిష్. పైగా కథానాయకుడుతో నష్టపోయిన బయ్యర్లకు ఈ చిత్రాన్ని తక్కువ రేట్లకు ఇవ్వడమే కాకుండా.. విడుదల తర్వాత వచ్చే వసూళ్లలో 40 శాతం వెనక్కి ఇస్తానంటూ మాటిచ్చాడు బాలయ్య. మరి చూడాలిక.. ఈ చిత్రంతో కథానాయకుడు గాయాన్ని మరిపిస్తాడో లేదో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Kalyan Ram Nandamuri, Krish, NTR Biopic, NTR Mahanayakudu, Rana, Telugu Cinema, Tollywood, Vidya Balan