సంక్రాంతి కలెక్షన్స్.. అడ్డంగా బుక్ అయిపోయిన బాలయ్య..

సంక్రాంతి సినిమాలు నాలుగు వ‌చ్చేసాయి.. దాంతో ఇప్పుడు ఏ సినిమా ఎంత వ‌సూలు చేసిందనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. అంద‌రి కంటే ముందు.. క‌లెక్ష‌న్ల రేసులో దూసుకుపోతున్న సినిమా ‘ఎఫ్2’. ఇప్పుడున్న లెక్క‌ల ప్ర‌కారం చూస్తుంటే సంక్రాంతి సినిమాల్లో ‘ఎఫ్2’ బ్లాక్ బస్టర్.. ‘పేట’.. ‘క‌థానాయ‌కుడు’.. ‘విన‌య విధేయ రామ’ డిజాస్ట‌ర్లు అయ్యేలా క‌నిపిస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 22, 2019, 5:30 AM IST
సంక్రాంతి కలెక్షన్స్.. అడ్డంగా బుక్ అయిపోయిన బాలయ్య..
సంక్రాంతి 2019 మూవీస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 22, 2019, 5:30 AM IST
సంక్రాంతి సినిమాలు నాలుగు వ‌చ్చేసాయి.. దాంతో ఇప్పుడు ఏ సినిమా ఎంత వ‌సూలు చేసిందనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. అంద‌రి కంటే ముందు.. క‌లెక్ష‌న్ల రేసులో దూసుకుపోతున్న సినిమా ‘ఎఫ్2’. జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం ఇప్పటి వరకు 9 రోజుల్లో ఏకంగా 45 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవ‌ర్సీస్లో కూడా 1 మిలియ‌న్ దాటేసి 1.5 మిలియన్ వైపు దూసుకుపోతుంది. ఇప్పటికే చాలా చోట్ల సేఫ్ జోన్‌కు వచ్చేసిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఫుల్ రన్‌లో కచ్చితంగా ‘ఎఫ్2’ 65 కోట్ల క్లబ్‌లో చేరేలా కనిపిస్తుంది.

Balakrishna NTR Kathanayakudu biggest disaster of this Sankranti.. సంక్రాంతి సినిమాలు నాలుగు వ‌చ్చేసాయి.. దాంతో ఇప్పుడు ఏ సినిమా ఎంత వ‌సూలు చేసిందనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. అంద‌రి కంటే ముందు.. క‌లెక్ష‌న్ల రేసులో దూసుకుపోతున్న సినిమా ‘ఎఫ్2’. ఇప్పుడున్న లెక్క‌ల ప్ర‌కారం చూస్తుంటే సంక్రాంతి సినిమాల్లో ‘ఎఫ్2’ సూప‌ర్ హిట్.. ‘పేట’.. ‘క‌థానాయ‌కుడు’.. ‘విన‌య విధేయ రామ’ డిజాస్ట‌ర్లు అయ్యేలా క‌నిపిస్తున్నాయి. sankranti 2019 movies,sankranti 2019 movies collections,f2 collections on top,f2 overseas collections,vinaya vidheya rama collections,vinaya vidheya rama overseas collections,ntr kathanayakudu collections,petta overseas collections,telugu cinema,సంక్రాంతి 2019 సినిమాల కలెక్షన్స్,ఎఫ్2 కలెక్షన్స్,ఎఫ్2 ఓవర్సీస్ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్,పేట కలెక్షన్స్,తెలుగు సినిమా,వినయ విధేయ రామ కలెక్షన్స్
ఎఫ్2 సినిమా


ఒక్క ‘ఎఫ్2’ మినహాయిస్తే మరే సినిమా కూడా ఈ పండక్కి వసూళ్ల వర్షం కురిపించలేదు. పేట సినిమా కూడా ముందు టాక్ కాస్త బాగానే తెచ్చుకున్నా కూడా అది కలెక్షన్ రూపంలో కనిపించడం లేదు. తెలుగులో ఇప్ప‌టి వరకు కేవలం 5 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌సూలు చేసింది ‘పేట‌’. ఓవ‌ర్సీస్ లో కూడా 2 మిలియ‌న్ వ‌సూలు చేసి 2.5 మిలియన్ వైపుగా అడుగులు వేస్తుంది. ఇక మూడోస్థానంలో

‘వినయ విధేయ రామ’ ఉంది. తొలిరోజు ఈ చిత్రం 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినా కూడా టాక్ దారుణంగా రావడంతో కలెక్షన్ల వేటలో పూర్తిగా వెనకబడిపోయింది. ఇప్పటి వరకు 10 రోజుల్లో ఈ చిత్రం 60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.Balakrishna NTR Kathanayakudu biggest disaster of this Sankranti.. సంక్రాంతి సినిమాలు నాలుగు వ‌చ్చేసాయి.. దాంతో ఇప్పుడు ఏ సినిమా ఎంత వ‌సూలు చేసిందనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. అంద‌రి కంటే ముందు.. క‌లెక్ష‌న్ల రేసులో దూసుకుపోతున్న సినిమా ‘ఎఫ్2’. ఇప్పుడున్న లెక్క‌ల ప్ర‌కారం చూస్తుంటే సంక్రాంతి సినిమాల్లో ‘ఎఫ్2’ సూప‌ర్ హిట్.. ‘పేట’.. ‘క‌థానాయ‌కుడు’.. ‘విన‌య విధేయ రామ’ డిజాస్ట‌ర్లు అయ్యేలా క‌నిపిస్తున్నాయి. sankranti 2019 movies,sankranti 2019 movies collections,f2 collections on top,f2 overseas collections,vinaya vidheya rama collections,vinaya vidheya rama overseas collections,ntr kathanayakudu collections,petta overseas collections,telugu cinema,సంక్రాంతి 2019 సినిమాల కలెక్షన్స్,ఎఫ్2 కలెక్షన్స్,ఎఫ్2 ఓవర్సీస్ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్,పేట కలెక్షన్స్,తెలుగు సినిమా,వినయ విధేయ రామ కలెక్షన్స్
కథానాయకుడు పోస్టర్


ఇక చివరగా ‘క‌థానాయ‌కుడు’ ఉంది. వీకెండ్లో కాస్త ప‌ర్లేద‌నిపించే వ‌సూళ్లు వచ్చాయి కానీ ఆ తర్వాత మళ్లీ పాత పాటే పాడింది ఈ చిత్రం. తొలిరోజు 7 కోట్లు తీసుకొచ్చాక త‌ర్వాత రేసులో పూర్తిగా వెన‌క‌బ‌డిపోయింది ఈ చిత్రం. ఇప్పటి వరకు 12 రోజుల్లో కేవలం 21.5 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసి చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్ అనిపించుకుంది ఈ చిత్రం. ఓవ‌ర్సీస్లో అయితే ‘కథానాయకుడు’ 8 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసింది. ప్రస్తుతం ‘ఎఫ్2’ బ్లాక్ బస్టర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ‘పేట’, ‘క‌థానాయ‌కుడు’, ‘విన‌య విధేయ రామ’ డిజాస్ట‌ర్లుగా మారిపోయాయి. మొత్తానికి ఈ సంక్రాంతి ఒక్క హిట్.. మూడు డిజాస్టర్లుగా నిలిచిపోయింది.
First published: January 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...