హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna : కత్తితో రౌడీ చేయి నరికిన బాలయ్య .. లేటెస్ట్ మూవీలో లీకైన ఫైట్ సీన్ వీడియో ఇదే..

Balakrishna : కత్తితో రౌడీ చేయి నరికిన బాలయ్య .. లేటెస్ట్ మూవీలో లీకైన ఫైట్ సీన్ వీడియో ఇదే..

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Balakrishna: బాలకృష్ణ అప్‌ కమింగ్ మూవీలోని యాక్షన్‌ సీన్ మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో బాలయ్య కత్తిని గాల్లో ఎగరవేస్తున్న సీన్‌ చూసి నందమూరి ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. వీడియో ఇదిగో..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మాస్ సినిమాలు చేసే హీరోల్లో ముందు వరసలో ఉండే నందమూరి బాలకృష్ణ(Balakrishna)ఇప్పటికి అదే టెంపోని కంటిన్యూ చేస్తున్నారు. అఖండ లాంటి భారీ హిట్‌ని సొంతం చేసుకున్న బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని(Gopichand Malineni)డైరెక్షన్‌లో .యాక్ట్ చేస్తున్నారు. ఈసినిమా కూడా బాలయ్య రేంజ్‌కి తగ్గట్లుగా ఫుల్‌ లెంగ్త్ మాస్, యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్. ఈసినిమా షూటింగ్‌కి సంబంధించిన ఓ యాక్షన్‌ సీన్ మేకింగ్ వీడియో(Making video)ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో బాలయ్య కత్తిని గాల్లో ఎగరవేస్తున్న సీన్‌ చూసి నందమూరి ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Ram Pothineni : రామ్ పోతినేని-బోయపాటి సినిమా షూటింగ్‌కు వెళ్లేది అప్పుడే.. హీరోయిన్ ఫైనల్..

బాలయ్య కత్తి పడితే పూనకాలే..

మాస్ ఆడియన్స్‌ పల్స్‌ తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ ఏజ్‌తో సంబంధం లేకుండా ఊర మాస్‌ సినిమాలు, భారీ యాక్షన్, ఫైట్ స్టోరీ సినిమాలే చేస్తున్నారు. తాజాగా ఆయన గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో యాక్ట్ చేస్తు NBK107 యాక్షన్‌ పార్ట్ టర్కీలో షూట్ చేశారు. అక్కడ బాలయ్యపై రౌడీలతో చేసిన ఓ ఫైట్ సీన్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపురం అఫీషియల్ పేరుతో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మేకింగ్‌ వీడియోలో బాలయ్య బ్లాక్ కలర్‌ షర్ట్‌.. లుంగిలో కత్తిని చేతుల్లో తిప్పుతుంటే..ఎదురుగా వైట్ అండ్ వైట్ డ్రెస్‌లు వేసుకున్న రౌడీలు భయంతో వణికిపోతుంటారు. ఈ మాస్‌ వీడియో క్లిప్‌..చూస్తున్న నందమూరి ఆడియన్స్‌ ఖుషీ అవుతున్నారు.

వైరల్ అవుతున్న మాస్ వీడియో..

రవితేజతో క్రాక్ సినిమా తర్వాత చేస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈసినిమాలో బాలయ్య లుక్, టీజర్‌కు సంబంధించిన వీడియోలకు ఇప్పటికే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా టైటిల్ ఫిక్స చేయని ఈసినిమా కోసం బాలయ్య అభిమానులే కాదు మాస్ సినిమాలు ఇష్టపడే వాళ్లు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా నటిస్తోంది శృతిహాస‌న్. క‌న్న‌డ నటుడు దునియా విజ‌య్ విలన్‌గా యాక్ట్ చేస్తున్నాడు.

HBD Puri jangannadh: టాలీవుడ్ ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ .. బద్రి టూ లైగర్ పూరీ సినీ ప్రస్థానం..

రికార్డులు బద్దలుకొట్టేనా ..

ఎస్ఎస్‌. థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్న ఈసినిమాకు జై బాల‌య్య అనే టైటిల్ పెట్టాలని ఫిక్సయ్యారట చిత్ర దర్శక,నిర్మాతలు. బాలయ్య రోరింగ్ పర్ఫామెన్స్‌ ఎలా ఉంటుందో ..ఏ రేంజ్‌లో రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Published by:Siva Nanduri
First published:

Tags: Bala Krishna, Tollywood actor, Viral Video

ఉత్తమ కథలు