హోమ్ /వార్తలు /సినిమా /

గుండుతో బాలయ్య.. వైరల్ అవతున్న బాలకృష్ణ న్యూ లుక్..

గుండుతో బాలయ్య.. వైరల్ అవతున్న బాలకృష్ణ న్యూ లుక్..

గుండుతో బాలయ్య (nandamuri balakrishna)

గుండుతో బాలయ్య (nandamuri balakrishna)

పాత్ర కోసం ఎంతటి సాహసం చేయడానికైనా వెనకాడని నందమూరి నట సింహం తాజాగా గుండుతో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసారు.

  పాత్ర కోసం ఎంతటి సాహసం చేయడానికైనా వెనకాడని నందమూరి నట సింహం తాజాగా గుండుతో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసారు. క్యారెక్టర్ ఏదైనా ఒకసారి రంగంలోకి దిగితే దమ్మిడి దిమ్మిడే. గతేడాది తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ కోసం రకరకాలు పాత్రలు వేసినా బాలయ్య.. ‘రూలర్’ సినిమాలో ఐరన్ మ్యాన్ లుక్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసాడు. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను సరికొత్తగా గుండుతో దర్శన మిచ్చి ఫ్యాన్స్‌ను సాధారణ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసాడు. బోయపాటి శ్రీను సినిమా కోసం బాలయ్య కొత్తగా కనిపించడం కోసమే గుండు చేయించుకున్నాడా అనేది సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ‘బైరవ ద్వీపం’లో కథ డిమాండ్ మేరకు అందాల బాలకృష్ణ..కురూపిలా కనిపించి అభిమానులను ఆశ్యర్యపరిచాడు. వైట్ అండ్ వైట్ ఖాదీ బట్టల్లో గుండు, గుబురు మీసాలతో బాలయ్య లుక్ అదిరిపోయింది. ఈ లుక్‌ను బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పాత్ర కోసం వివిధ రకాల విగ్‌లు వాడే బాలయ్య.. ఇపుడు బోయపాటి శ్రీను సినిమా కోసం గుండుతో కనిపించడం విశేషం.


  ఈ సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా టీడీపీ తమ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనాలని విప్ జారీ చేసింది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు బాలయ్య విజయవాడ వెళ్లారు. దీంతో బాలయ్య కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలయ్య, బోయాపాటి శ్రీను స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ చేసేసారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం బాలయ్య దాదాపు 15 కేజీల బరువు తగ్గడం విశేషం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Boyapati Srinu, NBK, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు