Home /News /movies /

BALAKRISHNA NBK 107 MOVIE TITLE CONFIRMED HERE ARE THE DETAILS SR

Balakrishna | NBK 107 : బాలకృష్ణ సినిమాకు టైటిల్ ఖరారు.. ఇది ఎవరు ఊహించనిదే..

NBK 107 Nandamuri Balakrishna Photo : Twitter

NBK 107 Nandamuri Balakrishna Photo : Twitter

Balakrishna | NBK 107 : అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య  ఓ మాస్ యాక్షన్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే.  (Balakrishna) బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichanda Malineni)తో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఖతర్నాక్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. 

ఇంకా చదవండి ...
    గత ఏడాది నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన అఖండ (Akhanda) మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమా 20థియేటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకుని ఈ డిజిటల్ యుగంలో వంద రోజుల పోస్టర్‌తో  సంచలనం రేపింది. పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో  పటా పంచలైపోయాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వరకు  గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా పేర్కొంది. మొత్తంగా రూ. 95 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ‘అఖండ’ మూవీ  హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.  అక్కడ కూడా ఎక్కువ మంది చూసిన సినిమా ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక అది అలా ఉంటే అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య  ఓ మాస్ యాక్షన్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే.  (Balakrishna) బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichanda Malineni)తో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు.

    ఈ సినిమాకు సంబంధించి ఓ ఖతర్నాక్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ విషయంలో అన్నగారు.. అంటూ పేరు వినిపించగా.. ఈ చిత్రానికి జై బాలయ్య అనే పేరు ఖరారు చేశారని, త్వరలోనే అధికారికంగా కన్ఫర్మేషన్ రానుందని సమాచారం. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కేక పెట్టిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ (Shruthi haasan) హీరోయిన్‌గా నటిస్తున్నారు.


    ఈ సినిమాలో అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ ఉందట. ఈ పాటను డింపుల్ హయతీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలుగులో ‘గద్దలకొండ గణేష్’లో ఓ ఐటెం సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత రవితేజ ‘ఖిలాడి’ మూవీలో కథానాయికగా నటించింది. తాజాగా ఇపుడు బాలయ్యతో ఐటెం సాంగ్ చేయబోతుందని అంటున్నారు. ఇది ఈ సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు. థమన్ ఊరమాస్ ట్యూన్‌ను రెడీ చేశారట. చూడాలి మరి ఈ పాట ఎలా ఉండునుందో..

    Balakrishna Remuneration, Remuneration for Balakrishna, Akhanda , Gopichand Malinani , Tolllywood, Sruthi Hassan, Nbk 107, BalaKrishna Gopichand Malineni titled as Anna garu, Shruthi haasan with balakrishna, NBK 107 Second Schedule, బాలకృష్ణ పారితోషికం,
    బాలయ్య, గోపీచంద్ Photo : Twitter


    ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా సిరిసిల్లలో ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది.  ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్.. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన లుక్‌ను కూడా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

    Balakrishna Photo : Twitter
    Balakrishna Photo : Twitter


    మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Balakrishna, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు