Balakrishna - Nani : బాలకృష్ణతో నటిస్తే ఆ తరహా సినిమాలో నటిస్తా.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాజాగా నాని.. నందమూరి నట సింహాం హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోలో అతిథిగా హాజరై బాలయ్యతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు ఈ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఒకరి గురించి మరొకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు. కరోనా కారణంగా తన రెండు సినిమాలు ‘వీ’ ‘టక్ జగదీష్’ సినిమాలు థియేటర్స్‌లో విడుదల ఓటీటీలో విడుదల కావడంపై ఒకింత బాధ పడ్డ విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత కాసేపు బాలకృష్ణ-నాని కాసేపు ముచ్చటించుకోవడమే కాకుండా సరదాగా క్రికెట్ కూడా ఆడారు. ఈ క్రమంలోనే బాలయ్య చేతికి బ్యాట్ రాగానే ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేసారు.
దాంతో ‘మీరు ఆగండ్రా.. టెన్షన్ పెట్టకండి’ అని బాలకృష్ణ తనదైన శైలిలో నవ్వులు పూయించారు. ఆ వెంటనే నాని కూడా ‘ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు’ అంటూ డైలాగ్ చెప్పడం వంటివి ఆసక్తి రేకిత్తించింది. ఇక నానికి ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి మీ ఇద్దరు మల్టీస్టారర్ మూవీ చేస్తారా అనే దానికి.. బాలయ్య కల్పించుకొని మీ దగ్గర స్టోరీ రెడీగా ఉందన్నారు.
Sridevi - Tamannaah - Kajal : శ్రీదేవి, తమన్నా, కాజల్ మధ్య ఉన్న ఈ విచిత్రమైన పోలిక తెలుసా..
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. హాలీవుడ్ క్లాసిక్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలయ్య మార్లన్ బ్రాడ్ పాత్ర చేస్తే.. నేను Al Pacino పాత్ర చేస్తానని చెప్పారు. ఇక ‘గాడ్ ఫాదర్’ సినిమా విషయానికొస్తే.. అమితాబ్ బచ్చన్ ‘సర్కార్’ సహా ఈ సినిమా స్పూర్తితో ఎన్నో చిత్రాలు వివిధ భాషల్లో తెరకెక్కాయి.మొత్తంగా నాని, బాలయ్య మల్టీస్టారర్ మూవీ కోసం మన దర్శకులు ఏదైనా కథను రెడీ చేస్తారా అనేది చూడాలి.
NBK 107 : అట్టహాసంగా ప్రారంభమైన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ..
ఈ షోలో బాలయ్య నాని ఓ ప్రశ్న అడుగుతూ..తన నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది అడగానే.. నాని తడుముకోకుండా. .‘సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ సినిమా పేరు చెప్పారు.
Vijay Devarakonda - Liger : ’లైగర్’ షూటింగ్‌కు ముందు చిల్ అవుతున్న విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్..
మరోవైపు నా సినిమాల్లో నచ్చని.. రాడ్ రంబోలా సినిమా ఏంటి అన్న ప్రశ్నకు నాని.. పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా పేరు చెప్పారు. దీనికి బాలయ్య.. ట్రెయిన్ ఎపిపోడ్ అంటూ చూపించడం.. దానికి ఈ సినిమా టూ మచ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన సినిమా అది. అందులో సర్‌ఫ్రైజింగ్ ఎలిమెంట్స్ ఎక్కువైపోయాయన్నారు. ఈ సందర్భంగా నానిని బాలయ్య.. నువ్వు నాచురల్ స్టార్ అయితే.. నేనెంటి అన్న బాలయ్య ప్రశ్నకు ఏదో అలా వచ్చేసిందన్నారు. మొత్తంగా ఈ షో గూస్ బంప్స్ అనే విధంగా ప్రేక్షకులను కిక్ ఎక్కించిందనే చెప్పాలి. ఏమైనా బాలయ్య తన టాక్ షోతో మరోసారి రచ్చ చేసారనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhanda movie, Balakrishna, Natural star nani, NBK 107, Tollywood, Unstoppable NBK