‘రూలర్’గా కేక పుట్టిస్తోన్న బాలయ్య కొత్త లుక్.. ఆనందంలో ఫ్యాన్స్..

నందమూరి బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 9, 2019, 3:32 PM IST
‘రూలర్’గా కేక పుట్టిస్తోన్న బాలయ్య కొత్త లుక్.. ఆనందంలో ఫ్యాన్స్..
బాలకృష్ణ నందమూరి (Twitter/Photo)
  • Share this:
నందమూరి బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దీపావళి సందర్భంగా పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య లుక్‌కు మాత్రం మంచి స్పందన రాలేదు. తాజాగా ఈ సినిమాలో ‘రూలర్’ బాలయ్య మరో లుక్‌ను విడుదల చేసారు. ఈ లుక్‌లో బాలయ్య చాలా యంగ్‌గా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ లుక్‌తో సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు చిత్ర యూనిట్. ఈ చిత్రం కోసం బాలయ్య బాగానే స్లిమ్ అయ్యాడు. పూర్తిగా యంగ్ ‌గా మరిపోయిన బాలయ్య లుక్‌ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  ఈ సినిమాను డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.

balakrishna nandarmuri new look released it is viral on social media,ruler,ruler movie,ruler movie balayya,ruler movie release date,balakrishna,balakrishna new movie title,balakrishna twitter,balakrishna instagram,balakrishna sonal chauhan,balakrishna vedika,vedika hot photos,sonal hot photos,balakrishna new movie,balakrishna ruler movie,balakrishna,balakrishna movies,balakrishna new movie title,ruler movie,nandamuri balakrishna,balakrishna 105 movie,balakrishna movie updates,balakrishna next movie title ruler,balakrishna latest movie updates,nandamuri balakrishna new movie,balakrishna dialogues,ruler,balakrishna ks ravikumar movie,balakrishna upcoming movie,balakrishna new movie teaser,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ న్యూ మూవీ టైటిల్,బాలకృష్ణ రూలర్,బాలకృష్ణ కేయస్ రవికుమార్,తెలుగు సినిమా
బాలకృష్ణ నందమూరి (Twitter/Photo)


ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 9, 2019, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading