క్యా సీన్ హై.. ఏపీ అసెంబ్లీలో బాలయ్య, రోజా.. సీన్ రివర్స్..

తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో చిత్ర, విచిత్రాలు చోటు చేసుకున్నాయి. మొన్నటి వరకు అధికార పక్షంలో ఉన్నవాళ్లు ప్రతి పక్షంలో.. ప్రతిపక్ష స్థానంలో ఉన్న వాళ్లు అధికార పక్షంలోకి వచ్చారు. కట్ చేస్తే..

news18-telugu
Updated: June 12, 2019, 4:45 PM IST
క్యా సీన్ హై.. ఏపీ అసెంబ్లీలో బాలయ్య, రోజా.. సీన్ రివర్స్..
బాలకృష్ణ,రోజా
  • Share this:
తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో చిత్ర, విచిత్రాలు చోటు చేసుకున్నాయి. మొన్నటి వరకు అధికార పక్షంలో ఉన్నవాళ్లు ప్రతి పక్షంలో.. ప్రతిపక్ష స్థానంలో ఉన్న వాళ్లు అధికార పక్షంలోకి వచ్చారు. కట్ చేస్తే.. ఇక సినిమా వాళ్ల విషయానికొస్తే.. ఏపీ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ, రోజాలకు ప్రత్యేక స్థానం ఉంది. వీళ్లిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు. అంతేకాదు బాలకృష్ణ తన తండ్రి స్థాపించిన తెలుగు దేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు.మరోవైపు రోజా కూడా బాలయ్య ప్రోత్సాహంతోనే టీడీపీలోనే తన పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టింది. అంతేకాదు టీడీపీలో ఆ పార్టీ మహిళ అధ్యక్షురాలిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీని వీడి కాంగ్రెస్ వైపు అడుగులు వేసింది. అంతలోనే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందినవైసీఆర్‌సీపీలో జాయిన్ అయింది.

Balakrishna nandamuri,roja take oath as mla's in Andhra pradesh Assembly,nandamuri balakrishna,rk roja,mla balakrishna,balakrishna facebook,Balakrishna,balakrishna roja,roja,balakrishna take oath as mla,roja take oath as mla,balakrishna tdp mla,roja ysrcp mla,andhra pradesh news,andhra pradesh politics,chandrababu naidu,ys jagan mohan reddy,ysrcp ys jagan mohan reddy,andhra pradesh assembly elections,ap assembly mla's oath,tollywood,telugu cinema,nbk,balayya,balakrishna twitter,balakrishna instagram,roja instagram,roja twitter,roja facebook,jabardasth judge roja,jabardasth comedy show,రోజా,బాలయ్య,బాలకృష్ణ,ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బాలకృష్ణ,ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజా,నగరి రోజా,హిందూపురం బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ
బాలకృష్ణ,రోజా


మరో విచిత్రమైన విషయం ఏమిటంటే బాలకృష్ణ, రోజాలు ఒకేసారి 2014 ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రోజా విషయానికొస్తే..గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రోజా గెలిచింది. కానీ బాలకృష్ణ మాత్రం మొదటిసారే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అప్పట్లో బాలకృష్ణ అధికార టీడీపీలో ఉంటే..రోజా ప్రతిపక్ష వైసీపీలో కొనసాగింది.తాజాగా  2019 జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో మరోసారి వీళ్లిద్దరు తిరిగి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. రోజా నగరి నుంచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెడితే.. బాలకృష్ణ ..హిందూపురం నుంచి శాసనసభలో అడుగుపెట్టారు. 2014లో బాలకృష్ణ అధికారపక్ష ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తే.. రోజా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. తాజాగా 2019 జరిగిన ఎన్నికల్లో మరోసారి వీళ్లిద్దరు అంతకు ముందు వీళ్లు గెలిచిన హిందూపురం, నగరి నియోజకవర్గాల్లో మరోసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. తాజాగా ఈ బుధవారం జరిగిన ఏపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవంలో బాలయ్య, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తే.. రోజా.. అధికార పక్ష ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కొసమెరుపు. ఈ రకంగా అసెంబ్లీలో బాలయ్య, రోజా విషయంలో సీన్ రివర్స్ అయింది.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు