హోమ్ /వార్తలు /సినిమా /

బ్లాక్ బస్టర్ దర్శకుడితో బాలకృష్ణ.. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మూవీ..

బ్లాక్ బస్టర్ దర్శకుడితో బాలకృష్ణ.. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మూవీ..

నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

ప్రస్తుతం బాలకృష్ణ..బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. బోయపాటి శ్రీను సినిమాతో పాటు బాలయ్య తనకు బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.

ఇంకా చదవండి ...

  హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా.. సినిమాలు చేసుకుంటూ పోతున్న బాలకృష్ణ.. గతేడాది చేసిన ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ వంటి సినిమాలతో బాలయ్య పలకరించాడు. ఈ చిత్రాలు ప్రేక్షకులతో పాటు అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం బాలకృష్ణ..బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక టాలీవుడ్‌లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌‌కు మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెెజెండ్’ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో తెలిసిందే కదా. అందుకే వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తనకు నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘లారీ డ్రైవర్’, రౌడీ ఇన్‌స్పెక్టర్,‘సమర సింహారెడ్డి’, ‘నరసింహా నాయుడు’ చిత్రాలు ఒక దాన్ని మించి మరొకటి ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత వీళ్లిద్దరిక కలయికలో చివరగా ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది.

  balakrishan nandamuri will work with director b gopal after long time,balakrishan nandamuri,b gopal,balakrishna b gopal,balakrishna boyapati srinu,balayya b gopal,nbk balayya b gopal,balakrishna facebook,balakrishna twitter,balakrishna instagram,balakrishna filmy newss,balakrishna movie updates,tollywood,telugu cinema,బి గోపాల్,బాలకృష్ణ నందమూరి, బి గోపాల్ బాలకృష్ణ,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బి గోపాల్ బాలకృష్ణ,బెజవాడ గోపాల్
  బాలకృష్ణ,దర్శకుడు బి.గోపాల్ (Twitter/Photos)

  ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో ‘హర హర మహదేవ’ చిత్రానికి కొబ్బరికాయ కొట్టినా.. ఆ తర్వాత కథ సెట్ కాకపోవడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ఇపుడు చాలా యేళ్ల తర్వాత మరోసారి బాలకృష్ణ, బి.గోపాల్  కాంబినేషన్‌‌కు రంగం సిద్ధం అయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బి.గోపాల్ దర్శకత్వంలో గోపిచంద్, నయనతార హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా పూర్తైయిన.. విడుదలకు మాత్రం నోచుకోలేదు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: B.Gopal, Balakrishna, Boyapati Srinu, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు