హోమ్ /వార్తలు /సినిమా /

బాలయ్య ఆ సూపర్ హిట్ రీమేక్‌కు ఓకే చెప్పాడా..

బాలయ్య ఆ సూపర్ హిట్ రీమేక్‌కు ఓకే చెప్పాడా..

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)

ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా బాలకృష్ణ మలయాళంలో సూపర్ హిట్టైన ఓ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు ప్రచారం జరగుతోంది

    ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ.. దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నట్టు ప్రచారం జరగుతోంది. తాజాగా బాలకృష్ణ మలయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు ప్రచారం జరగుతోంది. తాజాగా ఈ మలయాళ చిత్ర హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ రేటుకు కొనుక్కుంది. ఈ సినిమాను ఒక రిటైర్ట్ హవల్దార్, ఓ పోలీస్ ఆఫీసర్ మధ్య నడిచే కథాంశంతో తెరకెక్కింది. మలయాళంలో ఈ చిత్రంలో బిజు మీనన్, పృథ్వీరాజ్ నటించారు. వీళ్లిద్దరు మధ్య నడిచే ఈగో వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ కథ సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్‌గా సూటవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో బాలయ్యతో రీమేక్ చేస్తే బాగుంటుందని చిత్ర నిర్మాతలు అనుకుంటున్నారట.  ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్ వాళ్లు ఈ చిత్ర కథను త్వరలో బాలయ్యకు వినిపించే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రంలో మరో  పాత్రలో ఇంకో సీనియర్ హీరో ఎవరైనా నటించే అవకాశం ఉందని చెబుతున్నారు. దాని కోసం వెంకటేష్ లేదా రాజశేఖర్ పేరును పరిశీలిస్తున్నారట. మరి బాలయ్య ఈ రీమేక్ కథకు ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.

    balakrishna Nandamuri will remake malayalam super hit Ayyappanum Koshiyum movie here are the details,balakrishna,balakrishna Remake malayalam super hit Ayyappanum Koshiyum,balakrishna remake Ayyappanum Koshiyum movie,balakirhsna boyapati srinu movie,balakrishna b gopal,balakrishna due malayalam remake,tollywood,malluwood,NBK malayalam remake,balayya remake,బాలకృష్ణ మలయాళ సూపర్ హిట్ రీమేక్,బాలయ్య మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోశియమ్,బాలకృష్ణ బోయపాటి శ్రీను,బాలకృష్ణ బి గోపాల్,బాలకృష్ణ మలయాళ సూపర్ హిట్ రీమేక్లో నటించనున్నాడు
    మలయాళ సూపర్ హిట్ రీమేక్‌లో బాలకృష్ణ (Twitter/Photo)

    ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా, ఫ్యాక్షనిస్ట్‌గా రెండు పాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైంది. కరోనా నేపథ్యంలో అన్ని చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ వాయిదా పడ్డాయి. అందులో బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా కూడా ఉంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఎపుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తారట.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, Balayya, Malluwood, NBK, Tollywood

    ఉత్తమ కథలు