హోమ్ /వార్తలు /సినిమా /

బోయపాటి శ్రీను సినిమాలో కవల సోదరులుగా బాలకృష్ణ..

బోయపాటి శ్రీను సినిమాలో కవల సోదరులుగా బాలకృష్ణ..

బాలకృష్ణ (Balakrishna Nandamuri/Photo)

బాలకృష్ణ (Balakrishna Nandamuri/Photo)

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ కవల సోదరులుగా నటించబోతున్నట్టు సమాచారం.


  ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. గుండుతో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడని  అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. తాజాగా ఈ సినిమాను బోయపాటి శ్రీను  వారణాసి, రాయలసీమ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు సమాచారం. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచరాం. అందులో ఒకటి అఘోర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ అని చెబుతున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం బాలకృష్ణ ఇందులో కవల సోదరులుగా కనిపించనున్నారని సమాచారం. గతంలో బాలకృష్ణ.. కవల సోదరులుగా ‘అపూర్వ సహోదరులు’, ‘సుల్తాన్’, ‘అల్లరి పిడుగు’ చిత్రాల్లో కనిపించారు. మధ్యలో చాలా చిత్రాల్లో డ్యూయల్ రోల్లో నటించిన కవల సోదరులుగా మాత్రం నటించలేదు. ఇపుడు చాల ఏళ్ల తర్వాత బాలకృష్ణ.. కవల సోదరులుగా కనబడబోతున్నాడన్నమాట. ముఖ్యంగా కొన్ని నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరుల జీవితాల్లో నవగ్రహాలు..వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. చిన్నపుడే విడిపోయిన వీళ్లు మళ్లీ ఎలా కలిసారనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు.

  nandamuri balakrishna boyapati srinu new movie started with pooja ceremony,balakrishna new movie starts,nbk 106 starts with pooja ceremony,Balakrishna,Boyapati Srinu,NBK 105,nbk106,sanjay dutt,sanjya dutt balakrishna,balakrishna,balayya,boyapatisrinu,balakrishna shraddha srinath,shraddha srinath,shraddha srinath instagram,rular,kranthi,NBK 106,Balakrishna boyapati srinu Movie opening,nbk,balayya,nandamuri balakrishna facebook,nandamuri balakrishna twitter,nandamuri balakrishna instagram,nandamuri balayya trends,balakrishna nandamuri,Balakrishna Boyapati Srinu Muhurtham fix,Balakrishna Boyapati Srinu miryala ravinder reddy,balakrishna ks ravikumar,balakrishna rular,boyapati srinu remuneration,boyapati srinu movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,,బోయపాటి శ్రీను బాలకృష్ణ, బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్, బాలకృష్ణ బోయపాటి శ్రీను ముహూర్తం ఫిక్స్, బాలకృష్ణ బోయపాటి శ్రీను పూజా కార్యక్రమాలు,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా, బాలకృష్ణ బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్,బాలకృష్ణ,మిర్యాల రవీందర్ రెడ్డి,మిర్యాల రవీందర్ రెడ్డి బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ శ్రద్ధా శ్రీనాథ్,శ్రద్ధా శ్రీనాథ్,సంజయ్ దత్,బాలకృష్ణ సంజయ్ దత్,బోయపాటి శ్రీనుకు కొబ్బరికాయ కొట్టిన బాలకృష్ణ
  బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా ప్రారంభోత్సవం (Twitter/Photo)

  ఈ సినిమాలో బాలకృష్ణ ‘అఘోర’గా పాత్ర ఇంటర్వెల్‌లో ఎంట్రీ ఇవ్వనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో అఘోర పాత్రనే కీలకం అని చెబుతున్నారు. మరోపాత్ర రాయలసీమకు చెందిన ఫ్యాక్షనిస్ట్. టాలీవుడ్‌లో ఫ్యాక్షన్ సినిమాలనగానే ముందుగా బాలకృష్ణ పేరే గుర్తుకు వస్తోంది. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు. సింహా, లెజెండ్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియ, అంజలి నటించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 2 నుంచి హైదరాబాద్‌లో మొదలు కానుంది. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత వారణాసిలో భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసినట్టు సమాచారం. విలన్‌గా జగపతి బాబు నటిస్తున్నారు. ఇందులో జగపతి బాబు తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం.


  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Boyapati Srinu, NBK, NBK 106, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు