Home /News /movies /

BALAKRISHNA NANDAMURI WATCHED ALLU ARJUN PUSHPA MOVIE ALONG WITH HIS FAMILY MEMBERS AT PRASAD LABS TA

Balakrishna - Pushpa : కుటుంబ సభ్యులతో కలిసి ‘పుష్ప’ మూవీ స్పెషల్ షో వీక్షించిన బాలకృష్ణ..

అల్లు అర్జున్ ‘ఫుష్ప’ మూవీ వీక్షించిన బాలకృష్ణ (Balakrishna and Allu Arjun Photo : Twitter)

అల్లు అర్జున్ ‘ఫుష్ప’ మూవీ వీక్షించిన బాలకృష్ణ (Balakrishna and Allu Arjun Photo : Twitter)

Balakrishna - Pushpa : నందమూరి నట సింహా బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ‘పుష్ప’ (Pushpa)మూవీని వీక్షించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే కదా.

ఇంకా చదవండి ...
    Balakrishna - Pushpa : నందమూరి నట సింహా బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ‘పుష్ప’ (Pushpa)మూవీని వీక్షించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కానీ ‘పుష్ప’ మూవీ హిందీ సహా తమిళ, మలయాళ, కన్నడలో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ దాటి లాభాల్లోకి వచ్చింది. తెలుగులో మరో రూ.7 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తే హిట్ అనిపించుకుంటుంది. తాజాగా ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు బాలకృష్ణ కోసం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.

    ఈ స్పెషల్ షోకు నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వీక్షించారు. ఈ షోకు బాలయ్యతో  ఆయన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ, చిన్న కూతురు తేజస్విని ఆమె భర్తతో పాటు  పాటు బాలయ్య  సోదరి పురంధరేశ్వరి సహా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు ఈ సినిమాను వీక్షించారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. ‘పుష్ప’ సినిమా బావుందని చెప్పారు. ఇక పుష్ప 2 షూటింగ్ త్వరలో ప్రారంభమై దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

    కుటుంబ సభ్యులతో కలిసి ‘పుష్ప’ మూవీ వీక్షించిన బాలకృష్ణ (Twitter/Photo)


    రీసెంట్‌గా నట సింహా నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే కదా.  ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ..  వయసులో కాకపోయినా సీనియారిటీలో బాలయ్య గారు ఫాదర్‌ ఫిగర్‌, అఖండ ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపిన సంగతి తెలసిందే కదా. . బాలకృష్ణ డైలాగులు చెప్పే విధానం తనకు ఎంతో నచ్చుతుందని.. మూడు పేజీల డైలాగులైన బాలయ్యలా అందరికీ సాధ్యం కాదని చెప్పి బాలయ్య అభిమానుల మెప్పు పొందారు.

    Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలేకు అదిరిన టీఆర్‌పీ రేటింగ్.. గతంలో కంటే..


    అటు అల్లు అర్జున్.. బాలయ్య .. అల్లు అరవింద్‌కు చెందిన ఆహా ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ షోకు అల్లు అర్జున్.. పుష్ప టీమ్ సభ్యులైన రష్మిక మందన్న, సుకుమార్‌తో కలిసి హాజరై ఈ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఇరువురు హీరోలు తమ సినిమాలు హిట్టైన సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

    బాలకృష్ణ, రవితేజ‌లను డైరెక్ట్ చేసిన గోపీచంద్.. వైరల్ అవుతున్న అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో..

    ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Balakrishna, Mythri Movie Makers, NBK, Pushpa, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు