Balakrishna-Venkatesh: తెలుగుతో పాటు వివిధ సినీ ఇండస్ట్రీలో ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర బడా హీరోలు పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ పోటీ సంక్రాంతికి ఎక్కువగా ఉంటుంది. పొంగల్ పోటీలో ఒకటికి నాలుగు సినిమాలు విడుదల కావడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తోంది. గతంలో మహాభారత గాథతో ‘దాన వీర శూర కర్ణ’, కురుక్షేత్రం’ వంటి సినిమాలు ఒకేసారి వన్ డే గ్యాప్‌లో విడుదలైన సందర్భాలున్నాయి. అలా ఒకే స్టోరీతో ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో దిగిన హీరోల లిస్టులో బాలకృష్ణ, వెంకటేష్ కూడా ఉన్నారు. వీళ్లిద్దరు దాదాపు ఒకే తరహా కథను చేయడమే కాదు.. ఆ సినిమాలను ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో రిలీజ్ చేసారు. ఇక వీళ్లిద్దరు చేసిన ఈ సినిమా ఏమిటంటే..అశోక చక్రవర్తి, ధృవనక్షత్రం’ సినిమాలు.
‘అశోక చక్రవర్తి’ సినిమా విషయానికొస్తే.. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ సినిమాకు రీమేక్. ఈ సినిమాను ఎస్.ఎస్.రవిచంద్ర డైరెక్ట్ చేసారు. ముంబాయి మాఫియా బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమా 1989 జూన్ 29న విడుదలైంది.

ఒకే కథతో ఒకే రోజు విడుదలైన ‘అశోక చక్రవర్తి’ ‘ధృవ నక్షత్రం’ (File/Photos)
మరోవైపు వెంకటేష్ హీరోగా ‘ధ్రువనక్షత్రం’ కూడా దాదాపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వై.నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా దాదాపు మలయాళ సూపర్ హిట్ ‘ఆర్యన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమాకూడా 1989 జూన్ 29న రిలీజైంది. ఐతే.. బాక్సాఫీస్ బరిలో వెంకటేష్ హీరోగా నటించిన ‘ధృవనక్షత్రం’ సినిమా సూపర్ హిట్టైయితే.. బాలకృష్ణ నటించిన ‘అశోక చక్రవర్తి’ బాక్సాఫీస్ బరిలో చతికిలబడింది.

ఒకే కథతో ఒకే రోజు విడుదలైన ‘అశోక చక్రవర్తి’ ‘ధృవ నక్షత్రం’ (File/Photos)
మొత్తంగా మలయాళ సూపర్ హిట్ ‘ఆర్యన్’ మూవీ అఫీషియల్ రీమేక్ చేసిన సినిమా మాత్రం ‘అశోక చక్రవర్తి’ మూవీనే. ఈ సినిమాతో శరత్ సక్సేనా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన భానుప్రియ హీరోయిన్గా నటించింది. ఇళయరాజా సంగీతం అందించారు. ధృవ నక్షత్రం సినిమాను మలయాళ సూపర్ హిట్ ‘ఆర్యన్’ సినిమాలోని కథను తీసుకొని తెరకెక్కించారు.వెంకటేస్ సరసన రజినీ కథానాయికగా నటించింది. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ రెండు సినిమాలకు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించడం విశేషం. మొత్తంగా ఒక తరహా కథను ఇద్దరు హీరోలతో తెరకెక్కించడం. అవి ఒకే రోజు రిలీజ్ కావడం వాటికి మాటలు రాసిన రచయత ఒకరే కావడం మరో విచిత్రమనే చెప్పాలి. ఇక బాలకృష్ణ, వెంకటేస్ పలు సందర్భాల్లో సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో పోటీ పడిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ రెండు సినిమాల విషయానికొస్తే.. ఈ మూవీ మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ మూవీకి రీమేక్. ఈ చిత్రాన్ని తమిళంలో ద్రవిడన్’గా సత్యరాజ్ రీమేక్ చేస్తే.. కన్నడలో ’చక్రవర్తి’ గా విష్ణువర్ధన్ రీమేక్ చేసారు. హిందీలో ‘ఆర్యన్ మేరా నామ్’గా డబ్ చేసి రిలీజ్ చేసారు. దాదాపు అన్ని భాషల సినిమాల్లో శరత్ సక్సేనా విలన్ పాత్రలో నటించడం విశేషం. అవన్ని సూపర్ హిట్ అవ్వడం మరో ప్రత్యేకత అనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 01, 2021, 19:13 IST