హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ సంచలన పాత్ర.. టాలీవుడ్‌లో ఎవరు ఇలాంటి సాహసం చేయరేమో..

బాలకృష్ణ సంచలన పాత్ర.. టాలీవుడ్‌లో ఎవరు ఇలాంటి సాహసం చేయరేమో..

గుండుతో బాలయ్య (nandamuri balakrishna)

గుండుతో బాలయ్య (nandamuri balakrishna)

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేసుకున్నాడు. ఈయన గుండు ఎందుకు చేసుకున్నాడా అని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో సందేహం మొదలైంది. ఇంతకీ ఈయన గుండు ఎందుకు చేసుకున్నాడంటే..

ఇంకా చదవండి ...

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేసుకున్నాడు. ఈయన గుండు ఎందుకు చేసుకున్నాడా అని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో సందేహం మొదలైంది. అంతేకాదు ఈ లుక్‌తోనే బాలయ్య అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సంగతి తెలిసిందే కదా. ఈ లుక్‌లో బాలయ్య లుక్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య.. అఘోర పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. కాశీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సన్నివేశాల్లో బాలయ్య అఘోరగా కనిపించనున్నట్టు సమాచారం. వచ్చే నెల 15న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని బాలయ్య అఘోరగా కనిపించనున్న సన్నివేశాలతోనే మొదలు పెట్టనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు వారణాసి ఎపిసోడ్ హైలెట్‌‌గా నిలవనున్నట్టు సమాచారం.

once again balakrishna roja selfie hot topic in andhra pradesh politics,mla roja,balakrishna,rgv,roja,nandamuri balakrishna,balakrishna hindupur,roja nagari,balakrishna movies,balakrishna about roja,roja vs balakrishna,roja about balakrishna,balakrishna vs roja,balakrishna and roja,roja movies,balakrishna ignores roja,mla roja,mla balakrishna,roja speech in assembly,roja on balakrishna,roja and balakrishna,roja with balakrishna,balakrishna videos,roja and balakrishna video,balakrishna hit movies,roja selfie with balakrishna,balayya,nbk,nbk roja,balayya roja,రోజా,బాలకృష్ణ,రోజా సెల్ఫీ,రోజా బాలకృష్ణ,ఎమ్మెల్యే రోజా,బాలకృష్ణ రోజా,రోజా నగరి,బాలకృష్ణ హిందూపూర్
బాలయ్యతో రోజా సెల్ఫీ

ఇప్పటికే చిత్ర బృందం కాశీలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో శ్రీకాంత్ కానీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కానీ విలన్‌గా నటించే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. బాలయ్య, బోయపాటి శ్రీను విషయానికొస్తే.. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రంలో అఘోరగా  బాలయ్య, ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Balakrishna, Balayya, Boyapati Srinu, NBK, NBK 106, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు