అవునా.. ఎందుకు బాలయ్య రిటైర్ అవుతాడు.. అసలు ఇలాంటి ప్రచారం ఇప్పుడెందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా..? ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైన తర్వాత ఈ ప్రచారంలో జోరు పెరిగింది. సోషల్ మీడియాలో కూడా ఇదే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. నిజంగానే ఇప్పుడు బాలయ్య ఇప్పుడు తన భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ మాత్రం సీరియస్ అవుతున్నారు. తమ హీరోకు రిటైర్ కావాల్సిన అవసరం ఏముందంటూ ఇప్పుడు ఫైర్ అవుతున్నారు.
అయితే ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం మాత్రం నిజంగానే బాలయ్య మార్కెట్‌ను ప్రశ్నిస్తుంది. ఈ చిత్రం కనీసం 5 కోట్లు కూడా వసూలు చేయకపోవడంతో ఇప్పుడు బాలయ్య ఏం చేయాలి.. ఎలాంటి సినిమా చేస్తే అభిమానులకు నచ్చుతుందనే విషయంపై కూడా బాలయ్య చర్చించబోతున్నాడని తెలుస్తుంది. దీనికోసమే ఆయన త్వరలో అభిమానులతో ఓ మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ఉన్నట్లుండి ఆయన రిటైర్మెంట్‌పై వచ్చిన వార్తలపై కూడా బాలయ్య స్పందించబోతున్నాడని తెలుస్తుంది.
ఇక నుంచి ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందనే విషయంపై అభిమానుల నుంచి కొన్ని సలహాలు కూడా తీసుకోబోతున్నాడు ఈయన. ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్నాడు బాలయ్య. ఆ తర్వాత బోయపాటి సినిమాను మొదలు పెట్టనున్నాడు ఈయన. జూన్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కబోతుంది. మొత్తానికి మరి చూడాలిక.. ఈ రిటైర్మెంట్ వార్తలపై బాలయ్య ఎలా స్పందించబోతున్నాడో.. ఇక నుంచి ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Boyapati Srinu, NTR Biopic, NTR Mahanayakudu, Telugu Cinema, Tollywood