నందమూరి బాలకృష్ణ ఆ మలయాళ సూపర్ హిట్ రీమేక్‌కు నో చెప్పారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రీసెంట్గా మలయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగు రీమేక్‌లో బాలయ్య నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో బాలయ్య , రానా మరోసారి కలిసి యాక్ట్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ కథ విని బాలయ్య ఈ సినిమాకు నో చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ఒప్పుకున్న కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న బాలకృష్ణ.. ఇప్పట్లో ఈ సినిమా చేయలేనని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా హక్కులను సితారా ఎంటర్టైన్మెంట్స్ భారీ రేటుకు కొనుక్కొంది.ఈ సినిమాను సితార ఎంటర్టైంట్స్తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించనుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య తప్పుకున్నా.. రానా మాత్రం ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
ఈ సూపర్ హిట్ రీమేక్‌లో బాలయ్య ప్లేస్‌లో వెంకటేష్ నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వెంకటేష్ తమిళంలో హిట్టైన ‘నారప్ప’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఆ సినిమా కంప్లీటైన తర్వాత ఈ రీమేక్‌లో యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కరోనా లాక్డౌన్ తర్వాత ఈ సినిమా రీమేక్ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ సినిమాను ఒక రిటైర్ట్ హవల్దార్, ఓ పోలీస్ ఆఫీసర్ మధ్య నడిచే కథాంశంతో తెరకెక్కింది. మలయాళంలో ఈ చిత్రంలో బిజు మీనన్, పృథ్వీరాజ్ నటించారు. వీళ్లిద్దరు మధ్య నడిచే ఈగో వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Malluwood, NBK, Rana daggubati, Suresh Babu, Suresh Productions, Tollywood, Venkatesh