Home /News /movies /

BALAKRISHNA NANDAMURI NOT GET SUCCESS BUT SAMANTHA AKKINENI SHAKUNTALAM WILL SUCCESS THEY DESERVE RECEIVE IT WITH THIS SHAKUNTALAM MOVIE TA

Balakrishna - Samantha : బాలయ్యకు దక్కని ఆ సక్సెస్ సమంతకు దక్కుతుందా..

బాలకృష్ణ, సమంత (Twitter/Photo)

బాలకృష్ణ, సమంత (Twitter/Photo)

Balakrishna - Samantha : నందమూరి బాలకృష్ణకు దక్కని ఆ సక్సెస్ .. సమంత అందుకుంటుందా వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సమంత హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌ చేస్తోంది. అందులో భాగంగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా చేస్తోంది.

  Balakrishna - Samantha : నందమూరి బాలకృష్ణకు దక్కని ఆ సక్సెస్ .. సమంత అందుకుంటుందా వివరాల్లోకి వెళితే.. సమంత అక్కినేని తొలిసారి తన సినీ జీవితంలో  ‘శాకుంతలం’ అనే పౌరాణిక సినిమాలో నటించింది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తోంది.  కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంను గుణశేఖర్ పట్టాలెక్కించారు.  ఈ సినిమాలో సమంత టైటిల్ పాత్ర శకుంతల పాత్రలో నటించింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా యాక్ట్ చేసారు. సమంత విషయానికొస్తే.. ‘ఏమాయ చేసావే’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు తన తొలి చిత్ర హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది.

  మ్యారేజ్ తర్వాత సమంత కెరీర్.. మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్టుగా సాగిపోతుంది.  రీసెంట్‌గా సమంత.. తన సోషల్ మీడియా అకౌంట్‌లో అక్కినేని పేరు తొలిగించడంతో వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు మీడియా కోడై కూస్తోంది. దీనిపై సమంత కూడా క్లారిటీ ఇచ్చింది.  కానీ నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్ ఎక్కడ సమంత కనపడకపోవడంతో ఈ వార్తలకు బలం చూకూర్చినట్టైంది.

  Super Star Krishna : అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఈ సూపర్ హిట్ సీక్వెల్ మూవీ తెలుసా..

  ఇక సమంత హీరోయిన్‌గా నటిస్తూనే ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో యాంకర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే కదా. ఇక సమంత లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసింది.  ‘శాకుంతలం’ సినిమా విషయానికొస్తే.. దర్శకుడు గుణశేఖర్.. ‘రుద్రమదేవి’ తర్వాత చేస్తోన్న సినిమా అవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

  James Bond Heroes: సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ బాండ్‌గా ఇరగదీసిన హీరోలు వీళ్లే..

  ఈ మధ్యలో  రానాతో హిరణ్య కశ్యప అనుకున్నా కూడా అది పట్టాలెక్కలేదు. కానీ సమంత ముఖ్యపాత్రలో ‘శాకుంతలం’ సినిమా అనౌన్స్ చేసారు. ఈ చిత్రంలో మోహన్ బాబు దుర్వాస ముని పాత్రలో నటించారు.

  Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni instagram,Samantha Akkineni movies,Samantha Akkineni Shakuntalam,Samantha Akkineni Shakuntalam movie,Samantha Akkineni Shakuntalam dushyant,Samantha Akkineni Shakuntalam dev mohan dushyant,Samantha Akkineni Shakuntalam gunasekhar movie,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని శాకుంతలం సినిమా,శాకుంతలం సినిమా దుష్యంతుడు,దేవ్ మోహన్ దుష్యంతుడు శాకుంతలం సినిమా
  సమంత అక్కినేని శాకుంతలం (Samantha Akkineni)


  ఈ సినిమాను మహాభారతంలోని ఆదిపర్వం మూలం. ఈ సినిమాను గుణశేఖర్ శకుంతల, దుష్యంతుల ప్రేమగాథ ఆధారంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. మహాకవి కాళిదాసు రాసిన శాకుంతలం నాటకం .. వెస్ట్రన్‌ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది. ఇప్పటికే ఈ స్టోరీతో తెలుగులో  రెండు సినిమాలు వచ్చాయి. అందులో మొదటిది  ఎన్టీఆర్, బి.సరోజా దేవి హీరో, హీరోయిన్లుగా ‘శకుంతల’ పేరుతో కమలకర కామేశ్వరరావు తెరకెక్కించారు.

  ఎన్టీఆర్, బి.సరోజా దేవిల ‘శకుంతల’ మూవీ (Youtube/Credit)


  ఆ తర్వాత చాలా యేళ్ల తర్వాత ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాను తెరకెక్కించారు. అందులో ఓ భాగంగా శకుంతల, దుష్యంతుల ప్రణయ గాథ ఉంటుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ దుష్యంతుడిగా నటించారు. ఐతే.. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.

  ఎన్టీఆర్, బాలకృష్ణల ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’(File/Photo)


  మరి ఎన్టీఆర్ ఒకసారి తాను సోలో హీరోగా.. మరోసారి తన కుమారుడు బాలకృష్ణను దుష్యంతుడి పాత్రలో  తెరకెక్కించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. రెండు సార్లు ప్రేక్షకుల తిరస్కారానికి గురైన ఈ  సబ్జెక్ట్‌తో సమంత హీరోయిన్‌గా గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాతో  సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.

  ‘శాకుంతలం’లో సమంత (Instagram/Photo)


  ఆ సంగతి పక్కన పెడితే... గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దుష్యంతుడితో పాటు కణ్వ మహర్షి, విశ్వామిత్రుడు, మేనక వంటి పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.  ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhanda movie, Balakrishna, Samantha akkineni, Shaakuntalam, Tollywood

  తదుపరి వార్తలు