హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna Nartanasala First Look: నందమూరి బాలకృష్ణ నర్తనశాల ఫస్ట్ లుక్ విడుదల..

Balakrishna Nartanasala First Look: నందమూరి బాలకృష్ణ నర్తనశాల ఫస్ట్ లుక్ విడుదల..

బాలయ్య నర్తనశాల (Balakrishna Nartanasala)

బాలయ్య నర్తనశాల (Balakrishna Nartanasala)

Balakrishna Nandamuri Nartanasala First Look:  నందమూరి నట సింహం బాలకృష్ణ .. తన తండ్రి నటించిన పలు చిత్రాలను తాను రీమేక్ చేసాడు. న తండ్రి ఎన్టీఆర్, మహానటి సావిత్రి నటించిన ‘నర్తనశాల’ సినిమాను అదే టైటిల్‌తో నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి బాటలో తొలిసారి మెగాఫోన్ పట్టుకొని ‘నర్తనశాల’ చిత్రాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...

  Balakrishna Nandamuri Nartanasala First Look:  నందమూరి నట సింహం బాలకృష్ణ .. తన తండ్రి నటించిన పలు చిత్రాలను తాను రీమేక్ చేసాడు. అందులో లవకుశ సినిమాను ‘శ్రీరామరాజ్యం’ గా రీమేక్ చేస్తే.. ‘పాండురంగ మహాత్యం’ సినిమాను పాండురంగడు’ సినిమాగా చేసారు. అటు రాముడు భీముడు సినిమాను అదే టైటిల్‌తో కాస్తా మార్పులు చేసి అదే రాముడు భీముడు టైటిల్‌తో రీమేక్  చేసి సక్సెస్ అందుకున్నారు. మరోవైపు తన తండ్రి ఎన్టీఆర్, మహానటి సావిత్రి నటించిన ‘నర్తనశాల’ సినిమాను అదే టైటిల్‌తో నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి బాటలో తొలిసారి మెగాఫోన్ పట్టుకొని ‘నర్తనశాల’ చిత్రాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించాడు. ఇక ‘నర్తనశాల’ సినిమాను అప్పట్లో అన్నగారు ‘శ్రీ మద్విరాట పర్వం’ గా రీమేక్  చేసారు. అందులో అర్జునుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు‌తో పాటు విరాటపర్వంలో బృహన్నలగా ఐదు పాత్రల్లో నటించి మెప్పించారు అన్న ఎన్టీఆర్. ఈ చిత్రంలో బాలయ్య.. అభిమన్యుడి పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రంలో వాణిశ్రీ ద్రౌపది పాత్రలో నటించింది.

  శ్రీ మద్విరాట పర్వం (File/Photo)

  ఆ సంగతి పక్కనపెడితే.. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన  ఈ సినిమా సౌందర్య అకాల మరణంతో ఆగిపోయింది. అప్పట్లో రామోజీ ఫిలిం సిటీలో వేసిన పర్ణశాల సెట్‌లో 2004 మార్చి 1న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో భారీ క్యాస్టింగ్ కూడా ఉంది. తాజాగా ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

  BalakrishnaNandamuri Nartanasala Movie First Look Released,balakrishna nartanasala movie,Balakrishna Nandamuri Nartanasala Movie first Look released,Balayya Nartanasala first look released,balakrishna nartanasala movie shooting,balakrishna nartanasala movie shreyas ott,balakrishna nartanasala movie NBK theatre,balakrishna nartanasala movie shooting video,balakrishna nartanasala movie soundarya,balakrishna nartanasala movie ott release,దసరాకు నర్తనశాల,బాలకృష్ణ నర్తనశాల విడుదల,17 నిమిషాల నర్తనశాల సినిమా,బాలకృష్ణ నర్తనశాల ఫస్ట్ లుక్ విడుదల,బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ విడుదల,నందమూరి బాలకృష్ణ నర్తనశాల ఫస్ట్ లుక్ విడుదల
  ’నర్తనశాల’లో ధనుర్ధారి అర్జునుడిగా బాలయ్య ఫస్ట్ లుక్ (Twitter/Photo)

  అర్జునుడు, కృష్ణుడు బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయాలనుకున్నాడు. ఇక భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబు, దుర్యోధనుడిగా సాయికుమార్, అభిమన్యుడిగా ఉదయ్ కిరణ్‌, నకుల సహదేవులుగా నవీన్‌, వినయ్ నటిస్తున్న ఆ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు అప్పట్లో పిక్చరైజ్ చేసాడు బాలకృష్ణ. దాని నిడివి దాదాపు 17 నిమిషాలు ఉంటుంది. అయితే ఎప్రిల్ 17, 2004న ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సౌందర్య ప్రమాదానికి గురై చనిపోయింది. అందులో ఆమె సోదరుడు అమర్‌నాథ్‌ కూడా సజీవ దహనమయ్యాడు. దీంతో నర్తనశాలలో ద్రౌపది పాత్రలో సౌందర్యను కాక వేరే నటిని ఊహించుకోవడానికి ఇష్టపడని బాలయ్య.. ఈ సినిమాను ఆపేసారు. మధ్యలో  ద్రౌపది పాత్రలో గ్రేసీ సింగ్‌‌ను అనుకున్నారు. ఆ తర్వాత నయనతారతో  ఈ చిత్రాన్ని  కంప్లీట్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో బాలయ్య మనసు ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు బాలయ్య ప్యాకప్ చెప్పేసాడు.

  బాలయ్య నర్తనశాల (Balakrishna Nartanasala)
  బాలకృష్ణ నర్తనశాల (Balakrishna Nartanasala)

  అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు తిలకించే అరుదైన అవకాశం కల్పిస్తున్నాడు బాలయ్య. అప్పట్లో ఈ సినిమా కోసం షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను 2020 దసరాకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. 'నర్తనశాల' చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నడు బాలయ్య. ఎన్నాళ్ళనుండో 'నర్తనశాల' సన్నివేశాలను చూడాలన్న బాలయ్య అభిమానుల కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది.  ఏదిఏమైనా ఈ సన్నివేశాలు చూస్తే  దర్శకుడిగా బాలయ్య విజన్ ఎలాంటిదో ప్రేక్షకులకు తెలుస్తోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, NBK, NBK Nartanasala, Tollywood

  ఉత్తమ కథలు