హోమ్ /వార్తలు /సినిమా /

ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి‌తో బాలయ్య, నాగ్, వెంకీ, రమ్యకృష్ణ, అఖిల్.. వైరల్ అవుతున్న పిక్..

ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి‌తో బాలయ్య, నాగ్, వెంకీ, రమ్యకృష్ణ, అఖిల్.. వైరల్ అవుతున్న పిక్..

సీనియర్ ఎన్టీఆర్‌తో బాలయ్య,నాగ్,వెంకటేష్,రమ్యకృష్ణ,అఖిల్ (Twitter/Photo)

సీనియర్ ఎన్టీఆర్‌తో బాలయ్య,నాగ్,వెంకటేష్,రమ్యకృష్ణ,అఖిల్ (Twitter/Photo)

Sr NTR | ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో హీరోలతో పాటు వాళ్ల అభిమానులు వాళ్లకు సంబంధించిన పాత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌తో బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో హీరోలతో పాటు వాళ్ల అభిమానులు వాళ్లకు సంబంధించిన పాత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ ఎన్టీఆర్, ఆమె సతీమణి లక్ష్మీ పార్వతితో ఆయన కొడుకు బాలకృష్ణ, హీరో నాగార్జున, వెంకటేష్, రమ్యకృష్ణ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఫోటోలో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి చేతిలో నాగార్జున చిన్నకొడుకు అఖిల్ ఉన్నాడు. ఈ ఫోటో అఖిల్ ఫస్ట్ బర్త్ డేకు సంబంధించినట్టుగా ఉంది. అపుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ అఖిల్ పుట్టినరోజు వేడుకలకు వచ్చినట్టుగా ఉంది ఈ ఫోటో. ఇక ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి దంపతులు అఖిల్‌ను ఎత్తుకొని ఆశీర్వదించారు. అఖిల్‌ను ఆశీర్వదించేటపుడు కొడుకు బాలయ్యతో పాటు నాగార్జున, వెంకటేష్, రమ్యకృష్ణ కూడా ఉన్నారు. ఇక రమ్యకృష్ణ విషయానికొస్తే.. ఈ ఫోటోలున్న అందరి హీరోలతో కలిసి యాక్ట్ చేసింది. ఎన్టీఆర్‌తో కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించింది. ఇక అఖిల్ రెండో సినిమా ‘హలో’ లో అఖిల్ తల్లి పాత్రలో నటించింది. ఇక బాలయ్య, నాగ్, వెంకటేష్‌లతో కూడా హీరోయిన్‌గా హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.

First published:

Tags: Akkineni akhil, Balakrishna, Lakshmi Parvathi, Nagarjuna Akkineni, NBK, Ramya Krishna, Tollywood, Venkatesh

ఉత్తమ కథలు