హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna : షూటింగ్‌ స్పాట్‌లో గాయపడ్డ బాలకృష్ణ.. ఆందోళనలో అభిమానులు..

Balakrishna : షూటింగ్‌ స్పాట్‌లో గాయపడ్డ బాలకృష్ణ.. ఆందోళనలో అభిమానులు..

బాలకృష్ణ (File/Photo)

బాలకృష్ణ (File/Photo)

Balakrishna : నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్‌ కంప్లీట్ కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సినిమా తర్వాత బాలయ్య..

ఇంకా చదవండి ...

Balakrishna : షూటింగ్‌ స్పాట్‌లో గాయపడ్డ బాలకృష్ణ.. ఆందోళనలో అభిమానులు.. వివరాల్లోకి వెళితే.. నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్‌ కంప్లీట్ కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఘనంగా వీడ్కోలు పార్టీ కూడా నిర్వహించింది.  షూటింగ్ పూర్తి కావడంతో టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్ని ముమ్మురం చేసింది. ఈ  సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలో అఖండ టీమ్ ఈ విషయంలో ఓ ప్రకటన చేయనుంది.

ఇక అది అలా ఉంటే  బాలకృష్ణ ప్రముఖ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ఆహా కోసం ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ టాక్ షోకు సంబంధించిన ప్రోమో ఈ శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేసారు. ఈ ప్రోమోను క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ షో ప్రోమో చేస్తుండగా... బాలకృష్ణకు కాలికి తీవ్రంగా గాయమైంది. ఐనా.. ప్రోమో షూట్ కోసం బాలయ్య అలాగే షూటింగ్ కంప్లీట్ చేసినట్టు సమాచారం. షూటింగ్ తర్వాత హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నట్టు సమాచారం. ఈ  షోకు ‘అన్‌స్టాపబుల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌కు మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు గెస్ట్‌గా హాజరు కానున్నారు.  మొత్తంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆహా ఓటీటీ  కోసం బాలయ్య టాక్ షో చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న అఖండ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపోందిస్తున్నారు బోయపాటి శ్రీను. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయడంతో  త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

ఇప్పటికే ఈ సినిమా నుంచి అడిగా అడిగా అంటూ విడుదల చేసిన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.   ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా  జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కథానాయికగా పూర్ణ యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ  సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. అయితే దీపావళీకి రజనీకాంత్ అన్నాత్తే కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

First published:

Tags: Aha OTT Platform, Akhanda, Balakrishna, NBK, Tollywood

ఉత్తమ కథలు