ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఇప్పటికే దసార సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు ఒక పవర్ఫుల్ టైటిల్ అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ అనుకుంటున్నారు.ఎందుకంటే బోయపాటి తీసిన జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ సినిమాలో రూలర్ అన్న పాట ఉంది. ఆ పాట సూపర్ హిట్ కూడా అయ్యింది. అయితే అదే టైటిల్‌తో అప్పట్లో జూనియర్ కూడా సినిమా తీయాలనుకున్నాడట. అది కుదరలేదు. దీంతో ఇప్పుడు అదే ‘రూలర్’ బాలయ్య సినిమాకు టైటిల్ పెట్టడం అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాకు ‘క్రాంతి’ అనే టైటిల్‌తో పాటు ‘జడ్జిమెంట్’, ‘డిపార్ట్‌మెంట్’ అనే టైటిల్స్ కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి బాలయ్య సినిమాకు ఏ టైటిల్ పెడతాడరో చూడాలి. ఈ సినిమా తాజాగా షెడ్యూల్ ఈనెల 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Jr ntr, K. S. Ravikumar, NBK 105, Telugu Cinema, Tollywood