హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna : మరోసారి పెద్ద మనసు చాటుకున్న నందమూరి బాలకృష్ణ..

Balakrishna : మరోసారి పెద్ద మనసు చాటుకున్న నందమూరి బాలకృష్ణ..

బాలకృష్ణ (File/Photo)

బాలకృష్ణ (File/Photo)

Balakrishna : టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో,  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు.

Balakrishna : టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో,  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తెలుగు కథానాయకుల్లో బాలయ్య రూటే సెపరేటు. ఆయనకు ఆవేశం వచ్చినా తట్టుకోలేము. ప్రేమ వచ్చినా తట్టుకోవడం కష్టమే అంటారు ఆయనకు దగ్గరగా పరిశీలించిన వాళ్లు.  సాధారణంగా సోషల్ మీడియాలో అభిమాని చెంప చెళ్లుమనిపించిన బాలయ్య అంటూ తరచూ వార్తలు వింటూంటాం.. అయినా అభిమానులు బాలయ్య చెయ్యి వేసినా హ్యాపీగానే ఫీలవుతారు. ఆయన చేయి తాకినందకు మహానంద పడిపోతుంటారు అభిమానులు.  ఎందుకంటే ఆయన చూపించే ప్రేమ అలాంటింది అంటారు ఆయన ఫ్యాన్స్.

ఇక బాలయ్య కూడా అభిమానులంటే అంతే ప్రేమ.  ఇప్పటికే పలు సందర్భాల్లో ఆపదలో ఉన్న అభిమానులను ఆదుకోవడమే కాకుండా.. వారిని పరామర్శించిన సందర్భాలున్నాయి. అంతేకాదు తన తల్లి పేరిట ఉన్న బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ తరుపున ఎంతో మంది పేదలకు తన వంతు సాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ చిన్నారికి క్యాన్సర్ చికిత్సకు అవసరమయ్యే డబ్బులను సమకూర్చి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు బాలయ్య.

బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

హైదరాబాద్ మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే  పాపకు క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం రూ. 7 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. చిన్నారి తల్లిదండ్రులు ఇతర దాతల సహాయ సహాకారాలతో రూ. 1 లక్ష 80 వేలకు జమ అయింది. మిగతా మొత్తం మాత్రం వీరికి సర్దుబాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో పాప తల్లిదండ్రులు బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిని కలిసి పాప పరిస్థితిని వివరించారు.

NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

దీంతో అభిమాన సంఘం అధ్యక్షుడు ఈ విషయాన్ని  బాలకృష్ణకు ముందుకు తెచ్చారు. దీంతో బాలయ్య పాప చికిత్సకు అయ్యే మిగతా డబ్బులను మాఫీ చేసారు. అంతేకాదు చిన్నారి చికిత్స పూర్తయ్యే వరకు హాస్పిటల్‌లో అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చేయండని  తన హాస్పిటల్‌ వర్గాలకు ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

ప్రస్తుతం బాలయ్య ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పాటల చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మరోవైపు పూరీ జగన్నాథ్‌తో పాటు తన కుమారుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేస్తూ ఆదిత్య 999 మాక్స్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.

First published:

Tags: Akhanda, Balakrishna, Boyapati Srinu, Gopichand malineni, NBK, Tollywood

ఉత్తమ కథలు