హోమ్ /వార్తలు /సినిమా /

బాలయ్యను పోప్ ఫ్రాన్సిస్‌తో పోల్చిన అభిమానులు..

బాలయ్యను పోప్ ఫ్రాన్సిస్‌తో పోల్చిన అభిమానులు..

పోప్ ఫ్రాన్సిస్‌తో బాలయ్యను పోలుస్తున్న అభిమానులు (twitter/Photos)

పోప్ ఫ్రాన్సిస్‌తో బాలయ్యను పోలుస్తున్న అభిమానులు (twitter/Photos)

టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణను పోప్ ఫ్రాన్సిస్‌తో పోలుస్తున్నారు ఆయన అభిమానులు. అసలు బాలయ్యకు వాటికన్ చర్చి పోప్ ఫ్రాన్సిస్‌కు ఏమైనా సంబంధం ఉందా ? వివరాల్లోకి వెళితే..

  టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణను పోప్ ఫ్రాన్సిస్‌తో పోలుస్తున్నారు ఆయన అభిమానులు. అసలు బాలయ్యకు వాటికన్ చర్చి పోప్ ఫ్రాన్సిస్‌కు ఏమైనా సంబంధం ఉందా ? అని డౌటు పడుతున్నారా .. ఏమి లేదు.. నందమూరి బాలకృష్ణ.. ఏదైనా ఈవెంట్‌కు హాజరైపుడు తనకు ఎవరైన చికాకు కలిగిస్తే.. మీడియా కానీ ఎవరైనా చూస్తారన్న భయం బెరుకు లేకుండా..చెంప ఛెళ్లు మనిపించిన సందర్భాలు ఎన్నో ఉ న్నాయి. వేరే వాళ్లకు ఇది దురుసుతనంగా కనిపించినా.. బాలయ్య అభిమానులు మాత్రం తమ హీరో కొట్టాడనే బాధ కన్నా.. తమను ఈ రకంగానైనా టచ్ చేసాడని మురిసిపోతుంటారు. అంతేకాదు..తపుడు మార్గంలో ఉన్నపుడు మంచి మార్గంలో నడిపించడానికి అమ్మ నాన్నలు కొడుతుంటారు. అలా అని అమ్మా నాన్నలను కోపగించుకుంటామా.. అలాగే బాలయ్య కొట్టినంత మాత్రానా మాకు ఆయనపై అభిమానం ఏమాత్రం తగ్గదంటూ ప్రచారం చేసుకుంటారు ఆయన అభిమానులు. అంతేనా.. కోకాకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ కొత్త స్లోగన్ కూడా రెడీ చేసారు.

  తాజాగా న్యూ ఇయర్ వేడుక సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ చర్చి కొచ్చిన భక్తులను ఆశీర్వచనం అందించారు. అంతేకాదు కొందరు భక్తులకు న్యూ ఇయర్ విషెస్‌ను షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ చెప్పారు. ఈ సందర్భంగా కొంత మంది భక్తులకు కరచాలనం చేస్తూ పోప్ వెనుతిరుగుతుండగా.. ఒకామె మాత్రం పోప్ చేతిని పట్టుకోగా...పోప్ మాత్రం కోపంతో ఆమె చేతిని ఒదిలించుకున్న వీడియో ఇపుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత పెద్ద మత గురువుకే కోపం రాగా లేనిది మా బాలయ్యకు కోపం వస్తే మాత్రం తప్పా అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మోకాలీకి బట్ట తలకు లింకు పెట్టినట్టు ఇపుడు బాలకృష్ణ ఫ్యాన్స్.. పోప్ కోపాన్ని.. బాలయ్య కోపంతో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, NBK, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు