హోమ్ /వార్తలు /సినిమా /

మరికొన్ని గంటల్లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా బిగ్ అనౌన్స్‌మెంట్..

మరికొన్ని గంటల్లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా బిగ్ అనౌన్స్‌మెంట్..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా టైటిల్ ప్రకటన (Twitter/Photo)

బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా టైటిల్ ప్రకటన (Twitter/Photo)

BB3 NBK 106| ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. రేపు బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

    ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. గుండుతో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడని  అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నారు.  అందులో ఒకటి అఘోర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని  చెబుతున్నారు. రేపు బాలకృష్ణ 60వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా  చిత్ర యూనిట్.. ఈ సినిమాకు సంబంధించిన టైటైల్‌‌తో పాటు ఫస్ట్ లుక్‌ను ఈ రోజు సాయంత్రం 7 గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే  టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తోన్న మూడో చిత్రం కాబట్టి ప్రస్తుతానికి ఈ చిత్రానికి BB3 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. సింహా, లెజెండ్ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తోన్నఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు బాలయ్య పాడిన పాటను ఈ రోజు  సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, Balayya, Boyapati Srinu, NBK 106, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు