నందమూరి బాలకృష్ణ ఇపుడు మహేష్ బాబు క్లోజ్ ఫ్రెండ్ సాయం తీసుకుంటున్నాడు. అది కూడా బోయపాటి శ్రీనుతో చేస్తోన్నBB3 సినిమా కోసం. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లెజెండ్, సింహా లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. అది కూడా కవల సోదుర పాత్రల్లో నటించబోతున్నాడు. అందులో ఒకటి అఘోరా పాత్ర అయితే.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని చెబుతున్నారు.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంత భాగం వారణాసిలో చిత్రీకరించారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కరోనా సూచనలకు అనుగుణంగా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో బాలయ్య సహాయకుడి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ వుంది. ఈ క్యారెక్టర్ కోసం పలువురు హీరోల పేర్లు పరిశీలించిన చిత్ర బృందం తాజాగా అల్లరి నరేష్‌తో ఈ పాత్ర చేయించాలని చూస్తోంది.
అల్లరి నరేష్, బాలకృష్ణ (File/Photo)
ఇప్పటికే దర్శకుడు బోయపాటి శ్రీను అల్లరి నరేష్‌కు కలిసి ఈ పాత్ర ఎంత పవర్ఫుల్లో వివరించాడట. దీంతో అల్లరి నరేష్ ఈ సినిమాలో యాక్ట్ చేయడాకి ఒప్పుకున్నట్టు సమాచారం. రీసెంట్గా మహేష్ బాబు.. ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్ స్నేహితుడి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక థమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి, సిమ్రాన్ పేర్లు పరిశీలిస్తున్నారు. విలన్‌గా సోనూసూద్ యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇక చిత్రానికి ముందుగా ‘మోనార్క్’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘సూపర్ మేన్’, మొనగాడు, డేంజర్, యమ డేంజర్ అనే పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఫైనల్‌గా బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాకు ఏ టైటిల్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.