హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna: పురచేత్తో పట్టుకుంటావా.. కుర్ర హీరోను కొట్టిన బాలయ్య..

Balakrishna: పురచేత్తో పట్టుకుంటావా.. కుర్ర హీరోను కొట్టిన బాలయ్య..

బాలయ్య చేతులు మీదుగా ‘సెహరి’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

బాలయ్య చేతులు మీదుగా ‘సెహరి’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

NBK | నందమూరి నట సింహం బాలకృష్ణ వయసు అరవై దాటినా.. తన మనసు ఎపుడు ఆరేళ్లే అంటూ చాలా ఇంటర్వ్యూలలో  చెబుతుంటారు. ఇక అభిమానులు మాత్రం ఆయన్ని ముద్దుగా బాలయ్య అని సంభోదిస్తుంటారు. తాజాగా బాలయ్య సెహరి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమలో హీరోను కొట్టడం ఇపుడు వార్తల్లో నిలిచింది.

ఇంకా చదవండి ...

  NBK | నందమూరి నట సింహం బాలకృష్ణ వయసు అరవై దాటినా.. తన మనసు ఎపుడు ఆరేళ్లే అంటూ చాలా ఇంటర్వ్యూలలో  చెబుతుంటారు. ఇక అభిమానులు మాత్రం ఆయన్ని ముద్దుగా బాలయ్య అని సంభోదిస్తుంటారు. ఎలాంటి కల్మషం లేని భోళా శంకరుడు అని కూడా అంటుంటారు. ఇక బాలకృష్ణను దగ్గర నుంచి చూసినవాళ్లు ఆయనది ఎంత మంచి మనసు అని చెబుతుంటారు. మనసులో ఒకటి పెట్టుకొని బయట మరొకటి మాట్లాడటం ఆయనకు తెలియని నిష్కల్మషమైన వ్యక్తి అని ఆయన్ని దగ్గరగా చూసినవాళ్లు చెబుతుంటారు.  అంతేకాదు బాలయ్యలో  కోపం కాస్త ఎక్కువే. అభిమానులు కూడా ఎవరైనా తనతో అతిగా ప్రవర్తిస్తే.. ఎలాంటి మొహమాటం లేకుండా అక్కడే లాగి గుంజి కొట్టడం బాలయ్యకు ముందు నుంచి ఉన్న అలవాటు. ఇలాంటి అలవాట్లతో ఆయన ఎన్నోసార్లు విమర్శల పాలైయ్యారు కూడా.

  ‘సెహరి’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌కు ముఖ్యఅతిథిగా బాలయ్య (Twitter/Photo)

  కానీ బాలయ్య మాత్రం వీటన్నింటినీ పట్టించుకోకుండా.. తన దారిలో తాను వెళుతూ ఉంటారు.  బాలయ్య అభిమానులు మాత్రం ఈ విషయాలన్నింటినీ లైట్ తీసుకుంటారు. అంతేకాదు అమ్మ కొట్టిందని, నాన్న కోప్పడ్డాడని వాళ్లపై కోపం పెంచుకుంటామా అలాగే తమ అభిమాన హీరో బాలయ్య కొట్టాడని మేమేమి ఫీల్ కామని అభిమానులు సర్థి చెప్పుకుంటూ ఉంటారు.ఐతే.. బాలయ్య అభిమానులనే కాదు.. సెట్లో ఆయన చేయి చేసుకున్న సందర్భాలున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా బాలయ్య.. అంతా కొత్తవాళ్లతో ‘సెహరి’ అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసారు. ఈ చిత్రంలో హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో, హీరోయిన్స్‌గా నటించారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో బాలయ్య .. కరోనాకు అసలు మందు రాదంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపాయి. మరోవైపు హీరోలు, దర్శకులు నిర్మాత ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోని సాధ్యమైనంత తక్కువలో సినిమాలను తెరకెక్కించాలన్నారు.  ఆ సంగతి పక్కన పెడితే.. ‘సెహరి’ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఈ సినిమా హీరో హర్షను చేతిని బాలయ్య కొట్టడం కనిపించింది. దీంతో బాలయ్య ఆ హీరోను కొట్టాడంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు కొత్త హీరోను బాలయ్య కొట్టడం దారణం అంటూ ట్రోల్ కూడా చేసారు.

  ‘సెహరి’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌కు ముఖ్యఅతిథిగా బాలయ్య (Twitter/Photo)

  ఈ సంఘటనపై హీరో హర్ష కనుమిల్లి స్పందించారు. మా బాలయ్య బంగారం అన్నారు. ఆయన తనను కావాలని కొట్టలేదని వివరణ ఇచ్చాడు. తాను పుర చేత్తో అదేనండి.. ఎడమ చేత్తో పోస్టర్ పట్టుకోవడంతో వెంటనే చేయిపై ఒకటి వేసారన్నారు. ఎడమ చెేత్తో పట్టుకోవడం తప్పు అంటూ చెప్పి.. కుడి చేతితో పోస్టర్ పట్టుకోవాలని సరదగా తన చేతిని తాకారని వివరణ ఇచ్చాడు. మొత్తానికి బాలయ్య అతిథిగా రావడంతో  ‘సెహరి’ సినిమాకు ఇపుడు బోలెడంత పబ్లిసిటీ వచ్చింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Balayya, NBK, Tollywood

  ఉత్తమ కథలు