Balakrishna - Akhanda 3 Week Collections | నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి దుమ్ము లేపుతోంది అఖండ. ఈ సినిమా పదిరోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్‌కి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో ఎంటర్ అయినా పెద్దగా లేకుండా సాలిడ్ హోల్డ్ కలెక్షన్స్‌నే రాబడుతోంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 వ రోజు మరోసారి సాలిడ్‌గా హోల్డ్ చేసింది. ఈ సినిమా 19వ రోజు రూ. 42 లక్షల షేర్ని సాధిస్తే 20వ రోజు రూ. 34 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. తాజాగా మూడో వారం 21 రోజు రూ. 24 లక్షల షేర్ రాబట్టింది.
అఖండ మూడు వారాలు పూర్తి చేసుకుంది. మొత్తంగా 21 రోజుల కలెక్షన్స్
Nizam: Rs. 19.23Cr
Ceeded: Rs. 14.62Cr
UA: Rs. 5.95Cr
East: Rs. 4.0Cr
West: Rs. 3.88Cr
Guntur: Rs. 4.56Cr
Krishna: Rs. 3.46Cr
Nellore: Rs. 2.51Cr
AP-TG Total:- Rs. 58.21CR(95.60CR~ Gross)
Ka+ROI: Rs. 4.85Cr
OS – Rs.5.62Cr
Total WW: 68..68CR(120.80CR~ Gross)
అఖండ సినిమా 54 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగితే.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని 14.68 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుని అదరగొడుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఓ రేంజ్లో అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాను హిందీలో రీమేక్ కూడా చేస్తున్నారని.. ఈ రీమేక్‌లో అక్షయ్ లేదా అజయ్ దేవగన్ నటిస్తారని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
Upasana Konidela : ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా భేటి అయిన ఉపాసన..
బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రం కూడా మంచి విజయం దక్కించుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందించారు.
ఈ సినిమాను ద్వారక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇక అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు. ఇక బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నట్టు సమాచారం.
క్రాక్ డైరక్టర్ గోపీచంద్ (Gopichand)దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్గా నటించనుంది. ఇంకోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhanda movie, Balakrishna, NBK, Tollywood, Tollywood Box Office Report