Akhanda 4 Weeks (28 Days) collections | అఖండ సినిమా విడుదలై 4 వారాలు పూర్తి చేసుకొని విజయవంతంగా 5వ వారంలో అడుగు పెట్టింది. 28 రోజులు గడిచినా కూడా ‘అఖండ’ ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు. అఖండ సినిమా 4 వారాల్లో రూ. 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. విడుదలైన 28వ రోజు కూడా రూ. 10 లక్షల వరకు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది అఖండ. బోయపాటి (Boyapati Sreenu) దర్శకత్వంలో ఈయన నటించిన అఖండ (Akhanda) సినిమా 28 రోజుల కలెక్షన్స్ చూసిన తర్వాత ట్రేడ్ పండితులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 125 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 60 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది అఖండ. ఈ జాతర చూసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బాలయ్య బాక్సాఫీస్ స్టామినా తగ్గిపోయిందని కామెంట్ చేసిన వాళ్లకు అఖండ సినిమాతో దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చారు బాలయ్య. ఈ సినిమా 28 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం..
నైజాం(తెలంగాణ) : రూ. 19.87 కోట్లు (వచ్చింది)/ రూ. 10.5 కోట్లు (అమ్మింది)
సీడెడ్ (రాయలసీమ): రూ. 15.04 కోట్లు / రూ. 10.6 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.6.11 కోట్లు / రూ. 6 కోట్లు
ఈస్ట్:రూ. 4..09 కోట్లు / రూ.4.00 కోట్లు
వెస్ట్: రూ.4.03 కోట్లు / రూ.3.5 కోట్లు
గుంటూరు:రూ. 4.66 కోట్లు /రూ. 5.4 కోట్లు
కృష్ణా: 3.55 కోట్లు /రూ. 3.7 కోట్లు
నెల్లూరు: రూ.2.58 కోట్లు /రూ. 1.8 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: రూ. 59.93 కోట్లు / రూ. 45.50
ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: రూ.10.68 కోట్లు / రూ.7.5 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 25 డేస్ కలెక్షన్స్: రూ.70.61 కోట్లు షేర్ / రూ.53 కోట్లు
అఖండ సినిమాకు ఇంత కలెక్షన్స్ ప్రభంజనం కురిసినా కూడా ఇప్పటికీ రెండు చోట్ల సినిమా సేఫ్ అవ్వలేదు. గుంటూరులో ఈ సినిమాను రూ. 5.40 కోట్లకు అమ్మితే.. ఇప్పటి వరకు కేవలం రూ. 4.66 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా రూ. 70 లక్షల వరకు అక్కడ బాకీ ఉంది. మరోవైపు కృష్ణాలో కూడా రూ. 3.70 కోట్లకు సినిమాను అమ్మితే 3.55 కోట్లు మాత్రమే వచ్చింది. అక్కడ మరో రూ. 15లక్షలు వెనకబడి ఉంది ఈ చిత్రం. అయితే మిగిలిన చోట్ల మాత్రం అఖండకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.రూ. 53 కోట్ల బిజినెస్ చేస్తే.. ఏకంగా 70 కోట్లు షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది అఖండ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.