• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BALAKRISHNA MAHESH BABU GOT BLOCK BLUSTER WITH BALAKRISHNA FLOP MOVIE STORY HERE ARE THE DETAILS TA

Balakrishna - Mahesh Babu: బాలకృష్ణ ఫ్లాప్ స్టోరీతో మహేష్ బాబు హిట్ అందుకున్న సినిమా ఏంటో తెలుసా..

Balakrishna - Mahesh Babu: బాలకృష్ణ ఫ్లాప్ స్టోరీతో మహేష్ బాబు హిట్ అందుకున్న సినిమా ఏంటో తెలుసా..

బాలకృష్ణ,మహేష్ బాబు (File/Photo)

Balakrishna - Mahesh Babu: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన  ఫ్లాప్ మూవీ కథతో మహేష్ బాబు సూపర్ హిట్ అందుకున్నాడు. వివరాల్లోకి  వెళితే.. 

  • Share this:
    Balakrishna - Mahesh Babu: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన  ఫ్లాప్ మూవీ కథతో మహేష్ బాబు సూపర్ హిట్ అందుకున్నాడు. వివరాల్లోకి  వెళితే.. మహేష్ బాబు కెరీర్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఊరిని దత్తత తీసుకునే కాన్పెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్టైయింది. కొరటాల శివ టేకింగ్‌కు మహేష్ బాబు నటన తోడై ఈ సినిమా సూపర్ హిట్టైయింది. ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అంతేకాదు ఇపుడు టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా అందరి హీరోలతో వరుసగా సినిమాలు నిర్మిస్తూ బిజీ ఉంది. ఐతే.. ఇదే సినిమా స్టోరీని అప్పట్లో 1984లో బాలకృష్ణ ఓ సినిమా చేసాడు.

    సోలో హీరోగా బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న రోజులవి. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘జననీ జన్మభూమి’ సినిమా చేసాడు. ఈ చిత్రంలో హీరో కోటీశ్వరుడు. ఇందులో కూడా హీరో ఓ ఊరిని దత్తత తీసుకొని.. ఆ ఊరి ప్రజలను సారా,మద్యం నుంచి విముక్తి చేసి మంచి చేయాలని చూస్తాడు. అందుకోసం ఎన్నో కష్టనష్టాలను భరిస్తాడు. చివరకు ఊరిని బాగు చేయాలన్న తన సంకల్పాన్ని ఎలా నేరవేర్చుకున్నాడన్నదే జననీ జన్మభూమి స్టోరీ. అప్పట్లో ఈ సినిమాను కే.విశ్వనాథ్.. కమర్షియల్ హంగులుకు దూరంగా సాదాసీదాగా తెరకెక్కించాడు. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ అదే స్టోరీ పాయింట్‌ను కొరటాల శివ తీసుకొని తనదైన ట్రీట్‌మెంట్‌తో కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన మహేష్ బాబుకు మంచి సక్సెస్ అందించాడు.

    మహేష్ బాబు శ్రీమంతుడు Vs బాలకృష్ణ జననీ జన్మభూమి (File/Photos)


    మొత్తంగా సామాజిక నేపథ్యంలో తెరకెక్కిన కథతో బాలకృష్ణ ఫ్లాప్ అందుకుంటే.. మహేష్ బాబు మాత్రం సూపర్ హిట్ అందుకున్నాడు. మొత్తంగా ఎంత మంచి కథ అయిన.. దాన్ని ప్రేక్షకులకు నచ్చే రీతిలో తెరకెక్కిస్తే.. ఆదిరిస్తారు. ఒక్కో సారి స్టోరీ బాగున్నా ఒక్కోసారి సరైనా సమయంలో విడుదల కాక విఫలమవుతూ ఉంటాయి.  ఏమైనా మంచి కథ ఉన్న.. దాన్ని ప్రేక్షకులు ఆదిరించే దానిపై సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు