Balakrishna - Maa Elections : మా అధ్యక్షుడిగా బాలకృష్ణ అయితే ఓకే అంటున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ పడుతోన్న మంచు విష్ణు. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇన్ని రాజకీయలు ఉంటాయో ఉండవో కానీ.. మా ఎలక్షన్స్ అంత కంటే ఎక్కువ రాజకీయాలున్నాయి. ఇక్కడ జరగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. పైకి అంతా సినిమా ఫ్యామిలీ అంటూ చెప్పుకుంటున్న లోపలి మాత్రం ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయనే విషయం గత రెండు పర్యాయాలుగా జరుగుతున్న మా ఎన్నికలను చూస్తుంటే తెలుస్తోంది. ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తంగా ఐదుగురు సభ్యులు పోటీలో ఉన్నారు. ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమతో పాటు తెలంగాణ వాదంతో జీవీఎల్ నరసింహారావు ’మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే కదా.
తాజాగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘మా’ అధ్యక్షుడిగా ఇండస్ట్రీ పెద్దలు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, జయసుధ, సత్యనారాయణ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు వంటి పెద్దలు ఎవరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తాను పోటీ నుంచి తప్పుకుంటానని మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఎవరినీ ఎన్నుకున్న తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘మా’ అధ్యక్షుడుగా నందమూరి బాలకృష్ణ ఎన్నికైతే తాను ఎంతో సంతోషిస్తానని చెప్పుకొచ్చారు.
మంచు విష్ణు, బాలకృష్ణ (Twitter/Photo)
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. బాలయ్యతో పాటు ఆయన తరం నటీనటులు ఎవరు ‘మా’ ఎన్నికల్లో నిలబడటానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదన్నారు. వారిలో ఎవరు అధ్యక్షుడైన తనకు ఎలాంటి అభ్యంతరం లేదర్నారు. తనకు సోదరుడు లాంటి బాలయ్య ’మా’ అధ్యక్షుడు అయితే అంతకన్న సంతోషం లేదున్నారు. మరోవైపు నాగబాబు తనకు తండ్రితో సమానం అన్నారు. ఆయనంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. మరోవైపు ‘మా’కు శాశ్వత భవన నిర్మాణంపై తన ప్లాన్ ఏమిటో చెప్పాలని నాగబాబు వేసిన ప్రశ్నకు మంచు విష్ణు బదులిచ్చారు. ఏపీ, తెలంగాణతో పాటు కేంద్రం ప్రభుత్వంతోను తనకు తన కుటుంబానికి మంచి సత్స సంబంధాలే ఉన్నాయన్నారు. వారితో మాట్లాడి ‘మా’ కు శాశ్వత భవనం కోసం స్థలం సంపాదించగలననే నమ్మకం తనకు ఉందని చెప్పుకొచ్చారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.