తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు నటించింది కొన్ని సినిమాలే అయినా కూడా గుర్తింపు మాత్రం బాగా వస్తుంది. ఫ్లాప్ సినిమాలు చేసినా కూడా బాలయ్యతో నటిస్తే వచ్చే గుర్తింపు వేరు. అలాంటి హీరోయిన్ తను శ్రీ దత్తా. అప్పట్లో బాలయ్య సరసన ఓ సినిమా చేసింది ఈమె. వీరభద్ర సినిమాలో తను నటించింది. ఆ సినిమాతో గుర్తింపు అయితే రాలేదు కానీ మీటూతో మాత్రం అమ్మడు దెబ్బకు పాపులర్ అయిపోయింది. తెలుగు కంటే కూడా బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే కొన్నేళ్లుగా తనుకు అవకాశాలు మాత్రం రావడం లేదు. పైగా మీటూ ప్రభావంతో అమ్మడు సైడ్ వెళ్లడానికి దర్శక నిర్మాతలు కూడా ఆలోచిస్తున్నారు. ఏకంగా నానా పటేకర్ లాంటి లెజెండరీ నటుడినే టార్గెట్ చేసింది ఈమె. దాంతో తను శ్రీ దత్తా అంటేనే అమ్మో అంటున్నారు. ఇదిలా ఉంటే కొన్నేళ్ళ కింద వరకు సినిమాలు చేసినా కూడా ఈ మధ్య అసలు కనిపించడం లేదు. తన కెరీర్ కావాలనే నాశనం చేసారంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు మంచి రోల్స్ వస్తే మాత్రం కచ్చితంగా నటిస్తానని చెప్పింది తను శ్రీ దత్తా. కేవలం హీరోయిన్ పాత్రలే చేస్తానని తనకు లేదని.. ఎలాంటి పాత్రలైనా చేస్తానంటూ ఓపెన్ ఆఫర్స్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. కంటెంట్ బాగుంటే విలన్, వదిన పాత్రలు చేయడానికి కూడా రెడీ అంటుంది.

తనుశ్రీ దత్తా నానా పటేకర్
అలాంటి పాత్రలు చేయడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది తను. ఈ క్రమంలోనే బాలయ్యతో అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చింది. బాలయ్యతో ఏ హీరోయిన్ పని చేసినా.. బరువు పెరగడం ఖాయమని చెప్తుంది తను. 15 ఏళ్ల కింద 'వీరభద్ర' సినిమా చేసినపుడు 5 కేజీలు బరువు పెరిగిపోయానని చెప్పింది తనుశ్రీ. ఆ సినిమా సమయంలో బాలయ్యతో పాటు చిత్రయూనిట్ మొత్తం తనను బాగా చూసుకుందని.. ఎన్నో రకాల వంటకాలు టేస్ట్ చేసానని చెప్పింది.

బాలయ్య తనుశ్రీ దత్తా (Balakrishna Tanusree Dutta)
అలా షూటింగ్ అయ్యేసరికి 5 కిలోల బరువు పెరిగినట్లు చెప్పింది తను శ్రీ దత్తా. పెరిగిన బరువును తల్లి తండ్రులకు చూపిస్తూ.. తెలుగు ఇండస్ట్రీలో తనపై చూపించిన ప్రేమను చెప్పుకుంది ఈ భామ. అలా తెలుగు ఇండస్ట్రీని కూడా కాకా పడుతుంది తను శ్రీ దత్తా. అయితే ఎంత ఐస్ చేసినా కూడా ఈమెకు మాత్రం అవకాశాలు రావడం లేదు.
Published by:Praveen Kumar Vadla
First published:January 02, 2021, 06:13 IST