అవును.. దీపావళి సందర్భంగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘రూలర్’ లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకు ముందు విడుదల చేసిన లుక్‌లో స్టైలిష్‌గా కనిపించి అభిమానలను అలరించాడు బాలకృష్ణ. తాజాగా దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఈ లుక్‌లో బాలయ్య పోలీస్ గెటప్ చూసి అభిమానులు షాక్‌కు గురయ్యారు. ముందు విడుదల చేసిన లుక్స్ కంటే ఈ లుక్‌లో బాలయ్య ఎంతో నీరసంగా ఉన్నాడు. మొఖంలో గ్లో లేకుండా చాలా నీరసంగా హెయిర్ స్టైల్ సరిగా లేని బాలయ్యను చూసి అభిమానులు నీరసపడుతున్నారు. అసలే అంతగా అంచనాలు లేని ఈ సినిమాలో బాలయ్య లేటెస్ట్ స్లిట్ అంతగా ఆకట్టుకోలేదనేది అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ లుక్‌పై యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
పైగా బాలకృష్ణ.. ఎపుడు తనకు కలిసొచ్చే సంక్రాంతి సెంటిమెంట్ పక్కనపెట్టి.. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల చేస్తున్నాడు. పైగా మూడు నాల్గు సినిమాలతో పోటీ ఉంది. ఇన్నిటి మధ్య బాలయ్య.. కే.యస్.రవికుమార్‌ల ‘రూలర్’ బాక్సాఫీస్‌ను ఏ మేరకు రూల్ చేస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Bhumika, Heroine vedhika, K. S. Ravikumar, NBK 105, Ruler, Sonal chauhan, Telugu Cinema, Tollywood