‘ఎన్టీఆర్’ బయోపిక్ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను ఒక సినిమాకు కమిటైనా.. ఈ మూవీ స్టోరీ పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడంతోొ ముందుగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసాడు.అంతేకాదు పూజా కార్యక్రమాలు కూడా కానేచ్చేసాడు. ఇక ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినా.. ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే 7న బ్యాంకాక్‌లో ప్రారంభం కానున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ నుంచి ఎలా గ్యాంగ్ స్టర్‌గా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. ఫుల్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియండెట్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన లెజెండ్ భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించనుంది. ఇంకో కథానాయికగా వేదికను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం.
ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో జగపతి బాబు యాక్ట్ చేస్తున్నాడు.గతంలో బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ..సౌత్ ఇండియాలోనే మోస్ట్ స్టైలిష్ విలన్‌గా పాపులర్ అయ్యాడు. అంతేకాదు ఈ సినిమాలో జగపతి బాబు కూడా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియం చేయనున్నట్టు సమాచారం. మొత్తానికి వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి.. వచ్చే సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘రూలర్’ లేదా ‘క్రాంతి’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఎక్కువగా ‘క్రాంతి’ టైటిల్ వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, K. S. Ravikumar, NBK, Telugu Cinema, Tollywood